తాటిచెట్టు పైనుంచి పడి గీత కార్మికుడు మృతి
గుండాల : ప్రమాదవశాత్తు తాటిచెట్టు పైనుంచి జారి పడి గీత కార్మికుడు మృతి చెందిన సంఘటన మంగళవారం గుండాల మండలంలోని సుద్దాల గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన యామగాని బక్కయ్య(50) రోజుమాదిరిగా తాటిచెట్టు ఎక్కుతుండగా కమ్ముకున్న మంచుతో చెట్టు నుంచి జారి పడి తీవ్ర గాయాలయ్యాయి. కేకలు వేయడంతో చుట్టు పక్కల వారు అక్కడకు చేరుకున్నారు. కుటుంబ సభ్యులకు సమాచారం అందించి 108 అంబులెన్స్‌లో చికిత్స నిమిత్తం జనగామ ఏరియా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందాడు. మృతుడికి కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కుమారుడు నగేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తేజమ్‌రెడ్డి తెలిపారు.


