ఇదిగో పులి
ఫ ట్రాప్ కెమెరాకు చిక్కిన పులి ఆనవాళ్లు
ఫ బంధించేందుకు బోన్ల ఏర్పాటు
తుర్కపల్లి: రెండు వారాలుగా యాదాద్రి భువనగిరి జిల్లాలో కంటిమీద కునుకులేకుండా చేస్తున్న పులి ట్రాప్ కెమెరాకు చిక్కినట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. తుర్కపల్లి మండలం దత్తాయపల్లి రిజర్వు ఫారెస్ట్‌లో గడ్డిమేస్తున్న రైతు శ్రీశైలానికి చెందిన లేగదూడపై దాడి చేసి చంపేయగా మరో రెండు ఆవులు భయంతో పారిపోయాయి. మంగళవారం ఆ రెండు ఆవులను పులి చంపేసి తిన్న ఆనవాళ్లను కవ్వాల్ రిజర్వ్ ఫారెస్ట్ నుంచి వచ్చిన యానిమల్ ట్రాకర్స్ బృందం గుర్తించింది. ఆ పులి వయస్సు సుమారు 4 ఏళ్లు ఉండగా బరువు 300 కిలోల వరకు ఉంటుందని అంచనా వేశారు. పులిని బంధించేందుకు బోన్లు ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.


