ఓటరు వాయిస్
నిస్వార్థ సేవ చేసేవారికే నా ఓటు
సూర్యాపేట అర్బన్ : సూర్యాపేట మున్సిపాలిటీలో ఈసారి నాకు కొత్తగా ఓటు హక్కు వచ్చింది. మొట్టమొదటి ఓటును నిస్వార్థ చేసి మా వార్డును అభివృద్ధి పథంలో తీసుకెళ్లే అభ్యర్థికే వేస్తాను. రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును సద్వినియోగం చేసుకుని సరైన నాయకుడికి ఓటు వేస్తాను.
– అంతటి యోగేశ్వర్, సూర్యాపేట
సూర్యాపేట అర్బన్ : ఓటు వేయడం కేవలం హక్కు మాత్రమే కాదు.. ప్రతి పౌరుడి బాధ్యత కూడా. సరైన నాయకుడిని ఎన్నుకుంటేనే అభివృద్ధికి సహకరించినట్లవుతుంది. నచ్చిన, సమర్థవంతమైన నాయకుడిని ఎన్నుకునే అవకాశం ఒక్క ఓటు ద్వారానే లభిస్తుంది. ఈసారి నాకు ఓటు హక్కు రావడంతో మా కాలనీని అభివృద్ధి చేసే నాయకుడికే ఓటు వేయాలనుకుంటున్నాను.
– యాతాకుల భవిత, సూర్యాపేట
రామగిరి(నల్లగొండ): మున్సిపల్ ఎన్నికల్లో యు వత ఓట్లు ఎంతో కీలకంగా మారాయి. ప్రధాన పార్టీల అభ్యర్థులు యువతను ఆకర్షించడానికి అనేక హామీలు ఇస్తున్నారు. ఓటు హక్కు ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేస్తుంది. యువత కూడా ఆలో చించి తమకు సేవ చేసే వారికే మున్సిపల్ ఎన్నికల్లో ఓటు వేసి గెలిపించుకోవాలి.
– ఎండీ అమాన్, విద్యార్థి, నల్లగొండ
రామగిరి(నల్లగొండ): నల్లగొండ నగరం అభివృద్ధిలో యువత పాత్ర ఎంతో కీలకం. యువ ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా మంచి చేసేవారికే ఓటు వేయాలి. పెద్దవాళ్లకు కూడా తమ వార్డుల్లో పోటీ చేసే అభ్యర్థుల గురించి యువ ఓటర్లు వివరించి నిజాయితీగా ఓటు హక్కు వినియోగించుకునేలా చూడాలి. ప్రతిఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలి.
– ఎస్. చందన, విద్యార్థి, నల్లగొండ
అభ్యర్థి వ్యక్తిత్వానికి ఓటు
భువనగిరిటౌన్ : ప్రస్తుత మున్సిపాలిటీ ఎన్నికల్లో మొదటిసారి ఓటు హక్కు వినియోగించుకోబోతున్నాను. నాకు చాలా సంతోషంగా ఉంది. నమ్మకమైన, పనులు చేసే అభ్యర్థినికి ఓటు వేయాలని ఆలోచిస్తున్నా. రాజకీయ పార్టీలను చూసి కాకుండా వ్యక్తిగతంగా అభ్యర్థి మంచివాడా లేదా అని చూసి ఓటు వేస్తాను. నూతన ఓటర్లు ఎవరూ తమ ఓటు హక్కు వినియోగించుకోవడంలో నిర్లక్ష్యం చేయొద్దు.
– లింగాల శివాణి, భువనగిరి
ఓటరు వాయిస్
ఓటరు వాయిస్
ఓటరు వాయిస్
ఓటరు వాయిస్


