అప్పుడు బీఆర్‌ఎస్.. ఇప్పుడు కాంగ్రెస్
చౌటుప్పల్ : చౌటుప్పల్ మున్సిపాలిటీకి 2020లో తొలిసారి జరిగిన ఎన్నికల్లో 16వ వార్డు నుంచి బీఆర్‌ఎస్ తరపున పోటీ చేసి వెన్‌రెడ్డి రాజు గెలుపొంది మొదటి చైర్మన్‌గా పనిచేశారు. ప్రస్తుత ఎన్నికల్లో మున్సిపల్ చైర్మన్ పదవి జనరల్ మహిళకు రిజర్వు కాగా.. 16వ వార్డు బీసీ మహిళకు రిజర్వు అయ్యింది. దీంతో వెన్‌రెడ్డి రాజు తన భార్య వెన్‌రెడ్డి సంధ్యను ఎన్నికల బరిలోకి దింపారు. నాడు వెన్‌రెడ్డి రాజు బీఆర్‌ఎస్ నుంచి పోటీ చేసి గెలుపొందగా.. ఈసారి ఆయన భార్య సంధ్య కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు.
అప్పుడు బీఆర్‌ఎస్.. ఇప్పుడు కాంగ్రెస్


