కేసీఆర్ తెలంగాణ జాతిపిత కాదు
నల్లగొండ : ‘తెలంగాణ రాష్ట్ర సాధనలో అమరులైన వీరులే తెలంగాణ జాతిపితలు. కేసీఆర్ తెలంగాణ జాతిపిత కాదు’ అని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్‌లోని పలు డివిజన్లలో ఆయన మంగళవారం ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ ఒక్కడి వల్లే తెలంగాణ రాలేదన్నారు. తెలంగాణ కోసం శ్రీకాంతాచారి, కానిస్టేబుల్ కృష్ణయ్యతో పాటు ఎంతో మంది ఆత్మబలిదానం చేసుకున్నారని పేర్కొన్నారు. ఆ అమరులే తెలంగాణ జాతిపితలు కావాలి కానీ కేసీఆర్ జాతిపిత ఎలా అవుతాడని ప్రశ్నించారు. ‘కేసీఆర్ రాజీనామా చేసి మళ్లీ పోటీ చేశాడు కానీ నేను మాత్రం మంత్రి పదవికి రాజీనామా చేసిన.. సోనియాగాంధీ నాకు మంత్రి పదవి ఇస్తానన్నా కూడా తెలంగాణ వచ్చిన తర్వాతే మంత్రి పదవి తీసుకుంటాను’ అని చెప్పినట్లు గుర్తుచేశారు. కాంగ్రెస్‌లో ఉండి మా ప్రభుత్వం పైనే తెలంగాణ కోసం పోట్లాడినం. ప్రజల ఆకాంక్ష మేరకు సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చారు.. తెలంగాణ క్రెడిట్ అంతా సోనియాగాందిదే అని అన్నారు. తెలంగాణతో కేసీఆర్ కుటుంబమే బాగుపడిందని, ప్రజలకు జరిగిందేమీ లేదన్నారు. రాష్ట్రంలో 90 మున్సిపల్ చైర్మన్లు, కాంగ్రెస్ గెలుచుకుంటుందని, 5 కార్పొరేషన్లను కూడా కాంగ్రెస్ కై వసం చేసుకుంటుందని మంత్రి కోమటిరెడ్డి అన్నారు. అందులో నల్ల గొండ మేయర్ స్థానం ఉంటుందన్నారు.
నల్లగొండలోని పాతబస్తీలో ఎన్నికల ప్రచారంలో పాల్గొని బొడ్రాయి చైర్మన్
కందుల నిర్మలమ్మ గౌడ్ ఇంట్లో టీ తాగుతున్న మంత్రి కోమటి రెడ్డి వెంకట్‌రెడ్డి
ఫ తెలంగాణ ఉద్యమంలో
అమరులైన వారే జాతిపితలు
ఫ తెలంగాణ ఇచ్చిన క్రెడిట్ సోనియాదే..
ఫ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి


