ముందైతే వేసేద్దాం..!
చిట్యాల: మున్సిపాలిటీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ శుక్రవారంతో ముగియనుంది. ఉమ్మడి జిల్లాలోని వివిధ మున్సిపాలిటీల్లో ఆయా ప్రధాన పార్టీల నుంచి ఆశావహులు నామినేషన్లు వేసినప్పటికీ చాలా చోట్ల అభ్యర్థులను అధికారికంగా ప్రకటించలేదు. ఇంకొన్ని చోట్ల బీఫాంలు ఇవ్వలేదు. అయినప్పట్టికీ ఆశావహులు అన్ని వార్డులకు నామినేషన్‌న్లు దాఖలు చేస్తున్నారు. శుక్రవారం మధ్యాహ్నాం వరకు ఏఏ పార్టీల నుంచి ఎవరు బరిలో నిలిచారని తేలనుంది.
ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి
చైర్‌పర్సన్‌గా బరిలోకి..
మిర్యాలగూడ : మిర్యాలగూడ మున్సిపాలిటీ చైర్మన్ పదవి జనరల్ మహిళకు రిజర్వు కాగా.. కాంగ్రెస్ నుంచి చైర్‌పర్సన్ అభ్యర్థిగా నూకల కవితను ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ప్రకటించారు. 17వ వార్డు నుంచి కౌన్సిలర్‌గా పోటీ చేస్తున్న ఆమె గురువారం నామినేషన్ దాఖలు చేశా రు. అయితే మిర్యాలగూడ పట్టణంలోని కేఎన్‌ఎం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రికార్డు అసిస్టెంట్‌గా పనిచేస్తున్న కవిత ఇటీవలే తన ఉద్యోగానికి రాజీనామా చేసింది. ఆమె 2014 మున్సిపల్ ఎన్నికల్లోనూ కౌన్సిలర్‌గా పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత ఆమెకు రికార్డు అసిస్టెంట్ ఉద్యోగం రావడంతో జాబ్‌లో చేరింది. మళ్లీ ఇప్పుడు కౌన్సిలర్‌గా, చైర్‌పర్సన్‌గా అవకాశం రావడంతో ఉద్యోగానికి రాజీనామా చేసి ఎన్నికల బరిలో నిలబడింది.
బీఆర్‌ఎస్‌లో చేరిక
నల్లగొండ టూటౌన్: మాజీ కౌన్సిలర్ మొరిశెట్టి నాగేశ్వర్‌రావు–మమత దంపతులు గురువారం నల్లగొండలోని మాజీ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి క్యాంపు కార్యాలయంలో బీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే వారికి పార్టీ కండువా కప్పి బీఆర్‌ఎస్‌లోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకుడు మల్లికార్జున్‌రెడ్డి పాల్గొన్నారు.
ముందైతే వేసేద్దాం..!


