వీరి ఎన్నిక ఏకగ్రీవం | - | Sakshi
Sakshi News home page

వీరి ఎన్నిక ఏకగ్రీవం

Feb 4 2026 8:27 AM | Updated on Feb 4 2026 8:27 AM

వీరి

వీరి ఎన్నిక ఏకగ్రీవం

కోదాడలో ముగ్గురు

కోదాడలో ముగ్గురు

కోదాడ : కోదాడ మున్సిపాలిటీ ఎన్నికల్లో మూడు వార్డులు ఏకగ్రీవ మయ్యాయి. మున్సిపాలిటీ పరిధిలోని కొమరబండ 11వ వార్డు నుంచి మొత్తం 9 మంది నామినేషన్‌ దాఖలు చేశారు. కాంగ్రెస్‌ అభ్యర్ధిగా దేవరపల్లి మళ్లీశ్వరి మినహా మిగతా 8 మంది అభ్యర్థులు మంగళవారం తమ నామినేషన్‌లు ఉపసంహరించుకోవడంతో ఆమె ఏకగ్రీవంగా ఎన్నికై నట్లు అధికారులు ప్రకటించారు. 21వ వార్డు నుంచి నలుగురు నామినేషన్‌ దాఖలు చేశారు. కాంగ్రెస్‌ అభ్యర్థి కట్టెబోయిన జ్యోతి మినహా మిగిలిన ముగ్గురు నామినేషన్‌లు ఉపసంహరించుకున్నారు. 31వ వార్డు నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థి ఎర్నేని కుసుమతో పాటు మరో 8 మంది నామినేషన్‌ దాఖలు చేశారు. కుసుమ మినహా మిగతావారు తమ నామినేషన్‌లు ఉపసంహరించుకున్నారు. కోదాడ మున్సిపాలిటీలో ముగ్గురు మహిళా కౌన్సిలర్లు ఏకగ్రీవంగా ఎన్నిక కావడం ఇదే మొదటి సారి.

వీరి ఎన్నిక ఏకగ్రీవం1
1/2

వీరి ఎన్నిక ఏకగ్రీవం

వీరి ఎన్నిక ఏకగ్రీవం2
2/2

వీరి ఎన్నిక ఏకగ్రీవం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement