వీబీ జీ రామ్‌జీ పథకంపై రాజకీయం తగదు | - | Sakshi
Sakshi News home page

వీబీ జీ రామ్‌జీ పథకంపై రాజకీయం తగదు

Jan 31 2026 10:49 AM | Updated on Jan 31 2026 10:49 AM

వీబీ జీ రామ్‌జీ పథకంపై రాజకీయం తగదు

వీబీ జీ రామ్‌జీ పథకంపై రాజకీయం తగదు

రాజాపేట : గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కోసం మార్పులు చేసిన వీబీ జీ రామ్‌జీ పథకంపై కాంగ్రెస్‌ పార్టీ రాజకీయం చేయడం తగదని బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఊట్కూరి అశోక్‌ గౌడ్‌ అన్నారు. శుక్రవారం రాజాపేట మండలం కుర్రారం గ్రామంలో బీజేపీ ముఖ్యనాయకుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రైతు కార్మికులకు 125 రోజులకు పెంచడమే కాక కనీస వేతనం రోజుకు రూ.100ల నుంచి రూ.300కు పెంచడాన్ని కాంగ్రెస్‌ పార్టీ జీర్ణించుకోలేక ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. ఈ సమావేశంలో ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వట్టిపల్లి శ్రీనివాస్‌ గౌడ్‌, పడాల శ్రీనివాస్‌, సర్పంచ్‌ కోయ మధు, మండల ఉపాధ్యక్షుడు బర్మా శ్రీశైలం, ప్రధాన కార్యాదర్శులు యర్రగొకుల వినోద్‌, మెండు భగవాన్‌ రెడ్డి, ఉప సర్పంచు మార్క శివ, పలువురు నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement