భయంగా ఉంది
తిరుమలపురం గ్రామ సమీపంలోని పొలాల వద్ద పులి తిరుగుతోందన్న సమాచారం గ్రామస్తుల్లో కలకలం రేపింది. గ్రామస్తులం గుంపులు గుంపులుగా తిరుగుతున్నా భయం తొలగడం లేదు. ప్రజల ప్రాణ రక్షణకు అధికారులు అన్నీ గ్రామాల్లో పహారా ఏర్పాటు చేయాలి.
– డొనికెని వెంకటేష్, తిరుమలపురం
మండల పరిధిలో సంచరిస్తున్న పులితో ప్రజలంతా భయాందోళనకు గురవుతున్నారు. అటవీ శాఖ అధికారులు వెంటనే పులిని అడవుల్లోకి తరలించాలి. లేదంటే సురక్షితంగా పట్టుకోవాలి. పులి దొరికేంత వరకు గ్రామాల్లో భద్రతా చర్యలు మరింత కట్టుదిట్టం చేయాలి.
– చిలుక మల్లయ్య, రైతు గోపాలపురం
మా బావి దగ్గర పులి పాదముద్రలు కనిపించాయి. రైతులం ఒంటరిగా వ్యవసాయ పొలాలకు వెళ్లే పరిస్థితి లేదు. కుటుంబ సభ్యులను బయటకు పంపాలంటేనే భయమేస్తుంది. ఏ పనికీ పోలేని పరిస్థితి నెలకొంది. ఈ పులిని ఎప్పుడు బంధిస్తారో ఏమో అర్థంకావడం లేదు.
– నర్లేంగల రమేష్, రైతు ఇబ్రహీంపురం
భయంగా ఉంది
భయంగా ఉంది


