సాగర్‌లో శ్రీలంక మీడియా ప్రతినిధులు | - | Sakshi
Sakshi News home page

సాగర్‌లో శ్రీలంక మీడియా ప్రతినిధులు

Jan 30 2026 6:33 AM | Updated on Jan 30 2026 6:33 AM

సాగర్

సాగర్‌లో శ్రీలంక మీడియా ప్రతినిధులు

ఐక్యరాజ్యసమితి జల

సదస్సులో నల్లగొండ వాసి

రామగిరి(నల్లగొండ) : సెనెగల్‌ దేశ రాజధాని అయిన డకార్‌ నగరంలో ఈనెల 26, 27లో ఐక్య రాజ్య సమితి జల సదస్సు– 2026 సన్నాహక సమావేశం నిర్వహించారు. వివిధ దేశాల ప్రతినిధులు, ఐక్యరాజ్యసమితి సంస్థలు భాగస్వాములు పాల్గొని ప్రపంచ వ్యాప్తంగా నీటి సమస్యలు, నీటి వనరుల నిర్వహణపై చర్చించారు. ఈ సమావేశానికి నల్లగొండ మండలం నర్సింగ్‌భట్లకు చెందిన బొమ్మరబోయిన పృథ్వీరామ్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నీటి పాలన, రైతుల జీవనోపాధి, ఆహార వ్యవస్థలపై చర్చ జరిగినట్లు చెప్పారు. అదేవిధంగా డకార్‌లోని భారత రాయబార కార్యాలయ అధికారులతో సమావేశమయ్యారు. సమావేశాలు, చర్చల ఆధారంగా నీరు–వాతావరణ మార్పు, కార్బన్‌ మార్కెట్ల అనుసంధానంపై నివేదికను ఐక్యరాజ్యసమితి, సంబంధిత వర్గాలకు సమర్పించనున్నట్లు తెలిపారు.

నాగార్జునసాగర్‌ : పర్యాటక కేంద్రమైన నాగార్జునసాగర్‌ను గురువారం శ్రీలంక దేశానికి చెందిన మీడియా ప్రతినిధుల బృందం సందర్శించింది. శ్రీలంకకు చెందిన 30 మంది మీడియా ప్రతినిధులు ప్రస్తుతం హైదరాబాద్‌లోని డాక్టర్‌ మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో శిక్షణ పొందుతున్నారు. తెలంగాణ దర్శన్‌ కార్యక్రమంలో భాగంగా వారు నాగార్జునసాగర్‌కు వచ్చారు. బుద్ధవనం విశేషాలను వివరించే లఘుచిత్రాన్ని వీక్షించారు. శ్రీలంక ప్రభుత్వం సాగర్‌లోని బుద్ధవనంలో ఏర్పాటు చేసిన బుద్ధవిగ్రహం, ధ్యానవనం, స్థూపవనం తదితర ప్రాంతాలను సందర్శించారు. మహాస్థూపంలోని ధ్యానమందిరంలో ధ్యానం చేశారు. అనంతరం లాంచీలో నాగార్జునకొండకు వెళ్లారు. అక్కడ పునర్‌నిర్మించిన సింహళ విహారాన్ని సందర్శించి హర్షం వ్యక్తం చేశారు. వేల సంవత్సరాల క్రితమే భారతదేశం–శ్రీలంక మధ్య ఉన్న సాంస్కృతిక, ఆధ్యాత్మిక అనుబంధాన్ని ఈ సందర్భంగా వారు గుర్తుచేసుకున్నారు. స్థానిక టూరిజం గైడ్‌ సత్యనారాయణ నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు, నాగార్జునకొండ, బుద్ధవనం విశేషాలను వారికి వివరించారు.

వాహనం ఢీకొని మృతి

నిడమనూరు : వృద్ధురాలిని టాటా ఏస్‌ వాహనం ఢీకొనడంతో తీవ్ర గాయాలతో మృతి చెందింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిడమనూరు మండలంలోని ముకుందాపురం గ్రామానికి చెందిన కలికెనబోయిన లక్ష్మమ్మ(68) జాతీయ రహదారి–167పై నడుచుకుంటూ జెడ్పీ ఉన్నత పాఠశాల దగ్గరకు రాగా, మిర్యాలగూడ వైపు నుంచి వేగంగా వచ్చిన టాటా ఏస్‌ లక్ష్మమ్మను ఢీకొట్టింది. తీవ్ర గాయాలపాలైన మహిళను మిర్యాలగూడ ఆస్పత్రికి, వైద్యుల సూచనల మేరకు అక్కడి నుంచి నల్లగొండకు తరలిస్తుండగా మార్గమధ్యంలో లక్ష్మమ్మ మృతి చెందింది. మృతురాలు లక్షమ్మ కుమారుడు సైదయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

రాజాపేట : రాజాపేట మండలం చిన్నమేడారం, చల్లూరు యాదాద్రి మేడారాల్లో సమ్మక–సారలమ్మలు గద్దెలపై కొలువుదీరారు. గురువారం ప్రధాన పూజారులు సమీపంలోని గుట్టపై మూలదేవతా విగ్రహాల వద్ద ప్రత్యేక పూజలు చేశారు. కుంకుమ బరిణె రూపంలో ఉన్న సమ్మక్కను డపోలీసు బందోబస్తు మధ్య ఊరేగింపుగా ఆలయానికి తీసుకువచ్చి గద్దైపె ప్రతిష్ఠించారు. సమ్మక్క సారలమ్మలను తిలకించేందుకు వచ్చిన భక్తులతో ఆలయ ప్రాంతం జనంతో నిండిపోయింది. వనదేవతలను ప్రభుత్వ విప్‌ బీర్ల ఐలయ్య, ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య వేర్వేరుగా దర్శింకుకుని ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో సర్పంచులు చింతల సంపత్‌, బొడ్డు భాస్కర్‌, ఉప సర్పంచులు రావి కొండల్‌రెడ్డి, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు చామకూర గోపాల్‌ గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

సమ్మక్క, సారలమ్మకు పూజలు

పెన్‌పహాడ్‌: మండల పరిధిలోని గాజుమల్కాపురం గ్రామ శివారులో సమ్మక్క–సారలమ్మ జాతర రెండవ రోజు గురువారం వైభవంగా సాగింది. నాగులమ్మ గుడి వద్ద భక్తులు కుంకుమ, పసుపు చల్లి ప్రత్యేక పూజలు చేశారు. ఉత్సవాలకు మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ తూముల భుజంగరావు, టీఆర్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వట్టె జానయ్య హాజరయ్యారు. ఉత్సవాల సందర్భంగా తెలుగు రాష్ట్రాల స్థాయి కోలాటం పోటీలు నిర్వహించారు. దేవిరెడ్డి బ్రదర్స్‌ ఆధ్వర్యంలో మహా అన్నదానం చేపట్టారు. కార్యక్రమంలో దేవాలయ కమిటీ చైర్మన్‌ బండి మధుసూధన్‌రెడ్డి, సర్పంచ్‌లు నాతాల వెంకట్‌రెడ్డి, ఒగ్గు రవి, బండి రామకృష్ణారెడ్డి, దేవిరెడ్డి మధుసూదన్‌రెడ్డి, గుత్తికొండ రాంరెడ్డి, బచ్చలకూరి జానయ్య, భూక్య శివనాయక్‌ పాల్గొన్నారు.

ఆరేళ్ల బాలికపై అత్యాచారయత్నం

కోదాడరూరల్‌ : కోదాడ మండలానికి చెందిన ఆరేళ్ల బాలికపై ఓ వ్యక్తి అత్యాచారయత్నం చేశాడు. మూడురోజుల కింద రెండో తరగతి చదువుతున్న బాలికను సదరు వ్యక్తి తన ఇంటి సమీపంలోకి తీసుకెళ్లి అత్యాచారయత్నానికి పాల్పడగా.. బాలిక ఏడవడంతో వదిలేసి వెళ్లాడు. ఇంటికి వెళ్లిన తర్వాత బాలిక ప్రవర్తనలో మార్పు గమనించిన తల్లిదండ్రులు ఏం జరిగిందని అడగడంతో విషయాన్ని చెప్పింది. గురువారం బాలిక తల్లిదండ్రులు రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. పోక్సో కేసు నమోదు చేసి బాలికను వైద్య పరీక్షల నిమిత్తం సూర్యాపేటకు తరలించినట్లు ఎస్‌ఐ గోపాల్‌రెడ్డి తెలిపారు.

చల్లూరు యాదాద్రి మేడారంలో పూజలు చేస్తున్న ప్రభుత్వ విప్‌ బీర్ల ఐలయ్య

రాజాపేట : అమ్మవార్లకు బంగారం(బెల్లం)

సమర్పించేందుకు వస్తున్న భక్తులు

గిత్తల జోరు

ఫ సమ్మక్కను ఊరేగింపుగా తీసుకువచ్చి

గద్దైపె ప్రతిష్ఠించిన పూజారులు

ఫ భారీగా తరలివచ్చిన భక్తులు

సాగర్‌లో శ్రీలంక మీడియా ప్రతినిధులు 1
1/5

సాగర్‌లో శ్రీలంక మీడియా ప్రతినిధులు

సాగర్‌లో శ్రీలంక మీడియా ప్రతినిధులు 2
2/5

సాగర్‌లో శ్రీలంక మీడియా ప్రతినిధులు

సాగర్‌లో శ్రీలంక మీడియా ప్రతినిధులు 3
3/5

సాగర్‌లో శ్రీలంక మీడియా ప్రతినిధులు

సాగర్‌లో శ్రీలంక మీడియా ప్రతినిధులు 4
4/5

సాగర్‌లో శ్రీలంక మీడియా ప్రతినిధులు

సాగర్‌లో శ్రీలంక మీడియా ప్రతినిధులు 5
5/5

సాగర్‌లో శ్రీలంక మీడియా ప్రతినిధులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement