భువనగిరి ఖిలాను సందర్శించిన టీజీపీఎస్సీ చైర్మన్‌ | - | Sakshi
Sakshi News home page

భువనగిరి ఖిలాను సందర్శించిన టీజీపీఎస్సీ చైర్మన్‌

Jan 28 2026 8:44 AM | Updated on Jan 28 2026 8:44 AM

భువనగిరి ఖిలాను సందర్శించిన టీజీపీఎస్సీ చైర్మన్‌

భువనగిరి ఖిలాను సందర్శించిన టీజీపీఎస్సీ చైర్మన్‌

భువనగిరి: తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(టీజీపీఎస్సీ) చైర్మన్‌ బి. వెంకటేశ్వర్లు మంగళవారం భువనగిరి ఖిలాను సందర్శించారు. ఈ సందర్భంగా ఖిలాపై చారిత్రక కట్టడాలను తిలకించారు. రాజప్రసాదం, నీటి కొలనులు, కోట ప్రవేశ ద్వారాలు, ప్రహరీలు, ఏనుగు, గుర్రపు శాలలను పరిశీలించారు. ఖిలా చరిత్రను అడిగి తెలుసుకున్నారు. ఖిలాపై ర్యాప్లింగ్‌, జీప్‌లైన్‌ నిర్వహించే విధానాన్ని పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. ఆయన వెంట ఆర్డీఓ కృష్ణారెడ్డి, తహసీల్దార్‌ అంజిరెడ్డితో పాటు స్నేహితులు ఉన్నారు. భువనగిరి పట్టణ శివారులోని స్వర్ణగిరి క్షేత్రంలో గల శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయంలో టీజీపీఎస్సీ చైర్మన్‌ వెంకటేశ్వర్లు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకు ముందు ఆయనకు ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త మానేపల్లి రామారావు స్వాగతం పలికారు.స్వామి వారి తీర్థప్రసాదాలు అందజేసి శాలువాతో సన్మానించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement