ఇంటర్ పరీక్షలకు ఏర్పాట్లు చేయాలి
సాక్షి, యాదాద్రి : ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ భాస్కర్ రావు ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో ఇంటర్ పరీక్షల నిర్వహణ పై సంబంధిత అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు వార్షిక పరీక్షలకు 28 కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. సమావేశంలో అడిషనల్ ఎస్పీ లక్ష్మీ నారాయణ, భువనగిరి ఆర్డీఓ కృష్ణా రెడ్డి,జిల్లా ఇంటర్మీడియట్ అధికారి రమణి , జిల్లా విద్యాధికారి సత్యనారాయణ, జిల్లా అసిస్టెంట్ ట్రెజరీ అధికారి మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు.


