వాడవాడకు.. గడప గడపకు..
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మంగళవారం ఎన్నికల సామగ్రి పంపిణీకి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఆలేరు పట్టణంలోని ఎన్నికల సామగ్రిని ఎంపీడీఓ కార్యాలయంలో అధికారులు అందజేయనున్నారు. భువగిరి మున్సిపాలిటీకి సంబంధించిన సామగ్రి పంపిణీని భువనగిరిలోని దివ్యబాల విద్యాలయం, ఇంగ్లిష్ మీడియం హైస్కూల్‌లో ఏర్పాటు చేయగా, చౌటుప్పల్ మున్సిపాలిటీలో, సాన్ జాన్ విద్యానికేతన్ లక్కారం, మోత్కూర్‌లో వైజే గార్డెన్స్‌లో, పోచంపల్లి మున్సిపాలిటీలో బాలాజీ గార్డెన్స్‌లో, యాదగిరిగుట్ట మున్సిపాలిటీకి సంబంధించి ఎంపీడీఓ కార్యాలయంలో ఎన్నికల సామగ్రిని అందజేయనున్నారు.
సాక్షి, యాదాద్రి : మున్సిపల్ ఎన్నికల ప్రచారం ముగిసింది. సోమవారం సాయంత్రం 5 గంటల వరకు ప్రచార మైకులు మూగబోయాయి. చివరి రోజు అభ్యర్థులు ఇంటింటికీ తిరుగుతూ తమకే ఓటు వేయాలని కోరారు. ప్రధాన పార్టీల నేతలు, రోడ్‌షోలు, ర్యాలీలు, కార్నర్ మీటింగ్‌లతో హోరెత్తించారు. అభ్యర్థులు ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి ప్రలోభాలకు తెరలేపారు. ఈ నెల 11న భువనగిరి, ఆలేరు, చౌటుప్పల్, యాదగిరిగుట్ట, మోత్కూరు, పోచంపల్లి మున్సిపాలిటీల్లో పోలింగ్ జరగనుంది.
ప్రముఖుల ప్రచారం
యాదగిరిగుట్టలో సినీహీరో సుమన్, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, బీఆర్‌ఎస్ రాష్ట్ర రైతు విభాగం ప్రధాన కార్యదర్శి గొంగిడి మహేందర్ రెడ్డి, చౌటుప్పల్‌లో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, భువనగిరిలో ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి, మోత్కూరు మున్సిపాలిటీ పరిధిలో ఎమ్మెల్యే మందుల సామేల్, మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్, ఆలేరులో మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతా రావు సోమవారం ప్రచా రాన్ని హోరెత్తించారు. తమ అభ్యర్థులకు ఓట్లు వేసి గెలిపించాలని కోరారు.
ప్రలోభాల ఎర
ప్రచారం ముగిసిన వెంటనే అభ్యర్థులు ఓటర్లకు డబ్బు పంపిణీని ప్రారంభించారు. కాంగ్రెస్. బీఆర్‌ఎస్, బీజేపీలు పోటాపోటీగా ప్రలోభాల ఎర వేస్తున్నాయి. భువనగిరి, చౌటుప్పల్, పోచంపల్లి, ఆలేరు, యాదగిరిగుట్ట, మోత్కూరు మున్సిపాలిటీల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్‌ఎస్ మూడు పార్టీలు సగటున ఒక్క ఓటుకు రూ. 6వేల నుంచి రూ. 15 వేల వరకు ఇవ్వడానికి సిద్ధమయ్యారు. మద్యం, డబ్బులు, చీరలు, వెండి కుంకుమ బరిణెలు, బియ్యం, చికెన్, మటన్, మద్యం పంపిణీని ప్రారంభించారు. ఓటర్లుకు భారీగా డబ్బులు పంపిణీ చేస్తున్నారు.
● భువనగిరి మున్సిపాలిటీలో బొమ్మాయిపల్లి వార్డులో ఓ అభ్యర్థి ఇంటింటికీ జర్మన్ సిల్వర్ కుంకుమ కాయలు పంచుతున్నాడు. అన్ని వార్డుల్లో మద్యంబాటిళ్లు పంచుతున్నారు. రూ. 3 వేలనుంచి రూ. 5 వేల వరకు పంపిణీ చేస్తున్నారు. భువనగిరిలోని ఓ వార్డులో చీరల పంపిణీకి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. బ్యాంకు నుంచి తెచ్చిన కొత్త 10, 20, 50 రూపాయల నోట్లను కార్యకర్తలకు ఇచ్చారు. వాటిని తీసుకుని క్లాత్ షోరూంకు వెళితే చీరలు ఇచ్చే ఏర్పాట్లు చేశారు.
● ఆలేరులో జనరల్, రిజర్వుడ్ వార్డుల్లో అభ్యర్థులు ఒక్క ఓటుకు రూ. 4వేల నుంచి రూ. 5 వేల వరకు పంచుతున్నారు. చైర్మన్ సీటుపై కన్నేసిన వార్డులో నేటి వరకు ఓటు రికార్డు ధర పలుకనుంది. అయితే ఒకరు పంచిన డబ్బుల కంటే మరొ కరు అదనంగా పంచేందుకు ప్లాన్‌చేశారు. మద్యం, చీరలు, బియ్యం, ప్రెషర్ కుక్కర్‌లు అదనం.
● చౌటుప్పల్‌లో ఇప్పటికే మద్యం పంపిణీ పూర్తి అయ్యింది. 2,3, 19 వార్డుల్లో బీజేపీ అభ్యర్థులు ఓటకు రూ. 5 వేలు పంచుతున్నారు. వీరికంటే అదనంగా పంచే యోచనలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లు ఉన్నాయి. మహిళా ఓటర్లకు చీరలు,కూల్ డ్రింక్స్ పంచుతున్నారు.
● పోచంపల్లిలో చైర్మన్ అభ్యర్థి పోటీ చేస్తున్న వార్డులో రూ. 5 వేల నగదు, చీరలు, మద్యం, కూల్ డ్రింక్స్ పంచేందుకు సిద్ధమయ్యారు.
మున్సిపాలిటీలు 6
వార్డులు 102
పోలింగ్ కేంద్రాలు 208
బ్యాలెట్ బ్యాక్స్‌లు 449
ఓటర్లు 1,32,711
పురుషులు 64,926
మహిళలు 67,767
ఇతరులు 18
బరిలో ఉన్న
అభ్యర్ధులు 353
ఏకగ్రీవం 2 వార్డులు
ఫ వారం రోజులుగా హోరెత్తిన ప్రచారం
ఫ సోమవారంతో సమాప్తం
ఫ నేడు పోలింగ్ సామగ్రి పంపిణీ
ఫ ఏర్పాట్లు చేసిన అధికారులు
వాడవాడకు.. గడప గడపకు..


