మోగిన ముని్సపల్ నగారా
సాక్షి,యాదాద్రి: పుర ఎన్నికలకు వేళయ్యింది. రాష్ట్ర ఎన్నికల సంఘం మంగళవారం మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు షెడ్యూల్ విడుదల చేసింది. జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల్లో ఈనెల 11న పోలింగ్ జరగనుంది. బుధవారం నోటిఫికేషన్ రానుంది. ఇదే రోజు నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. ఈమేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మొత్తం 132711 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 64,926 మంది పురుషులు, 67,767 మంది మహిళలు, 18 మంది ఇతరులు ఉన్నారు.
మున్సిపాలిటీలకు చేరిన సామగ్రి
ఎన్నికల నిర్వహణకు అవసరమైన మెటీరియల్ మున్సిపాలిటీలకు చేరింది. పోలింగ్ సామగ్రి, బ్యాలెట్ బాక్సులు మున్సిపాలిటీలకు పంపిణీ చేశారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారులుగా గెజిటెడ్ అధికారులను నియమించారు. రిటర్నింగ్ అధికారులే బుధవారం ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేస్తారు. ఒక్కొక్కరికి మూడు వార్డుల చొప్పున క్లస్టర్‌లు ఏర్పాటు చేసి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ చేపట్టనున్నారు.
అమలులోకి ఎన్నికల కోడ్
మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ వెలువడడంతోనే ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. దీంతో ప్రభుత్వ కార్యక్రమాలలో భాగంగా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిలిచిపోనున్నాయి. ఎన్నికల సంఘం ఆదేశాలో ప్రభుత్వ కార్యాలయాలు, మున్సిపాలిటీల్లో రాజకీయ పార్టీల చిహ్నాలను తొలగిస్తున్నారు. ఫ్లెక్సీలు, వాల్‌పోస్టర్లు, గోడలపై రాతలను తుడిచివేస్తున్నారు.
ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు
ఆరుమున్సిపాలిటీల్లో 104 వార్డుల్లో 212 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 800 ఓటర్లకు ఒక పోలింగ్ బూత్ చొప్పున ఏర్పాటు చేశారు. ప్రతి వార్డులో రెండు పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. అధికంగా ఓటర్లు ఉన్న చోట మూడు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. బ్యాలెట్ పద్ధతిన పోలింగ్ నిర్వహించనున్నందున 449 బ్యాలెట్ బాక్స్‌లు సిద్ధంగా ఉంచారు. తెలుపు రంగు బ్యాలెట్ ద్వారా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి. 42 మంది రిటర్నింగ్ అధికారులు, 42 మంది అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులను నియమించారు. 29 మంది జోనల్ అధికారులు, ప్రతి పోలింగ్ కేంద్రానికి నలుగురు చొప్పున సిబ్బందిని నియమించారు. అన్నిపోలింగ్ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్ ఉంటుంది. మున్సిపల్ కేంద్రాల్లోనే పోలింగ్ డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. భువనగిరి దివ్యబాల విద్యాలయంలో ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తి చేశారు.
ఆరు మున్సిపాలిటీల్లో 104 వార్డులకు ఎన్నికలు
ఫ నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ
ఫ ఫిబ్రవరి 11న పోలింగ్
ఫ ఓటుహక్కు వినియోగించుకోనున్ను 132711మంది ఓటర్లు
మోగిన ముని్సపల్ నగారా


