ఎంజీయూ ప్రాజెక్ట్‌కు రాష్ట్రస్థాయి బహుమతి
నల్లగొండ టూటౌన్ : ఎంజీ యూనివర్సిటీకి చెందిన ఇంజనీరింగ్(సీఎస్‌ఈ) విద్యార్థులు రూపొందించిన ప్రాజెక్ట్‌కు రాష్ట్రస్థాయిలో ఉత్తమంగా గుర్తింపు లభించించిందని సీఎస్‌ఈ విభాగం అధిపతి ఎం.జయంతి తెలిపారు. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన అన్వేషణ 2026 రాష్ట్ర స్థాయి ప్రాజెక్టుల ప్రదర్శనలో ఎంజీయూ ఇంజనీరింగ్ 3వ సంవత్సరం విద్యార్థులు రూపొందించిన స్మార్ట్ ఫేస్ రికగ్నైజేషన్‌ను ప్రదర్శించారు. ఈ ప్రాజెక్ట్ రాష్ట్ర స్థాయిలో ఉత్తమంగా ఎంపికై నట్లు ఆమె పేర్కొన్నారు. ప్రాజెక్ట్‌ను రూపొందించి ప్రదర్శించిన విద్యార్థులు రాహుల్, సౌమ్యన్‌ను యూనివర్సిటీ వీసీ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ మంగళవారం అభినందించారు.


