ఎలాంటి పొరపాట్లు లేకుండా చూడాలి
భువనగిరిటౌన్ : ఎన్నికల నిర్వహణలో ఎలాంటి పొరపాట్లు లేకుండా చూసుకోవాలని అదనపు కలెక్టర్ భాస్కర్ రావు సూచించారు. భువనగిరి మున్సిపల్ కార్యాలయంలో భద్రపరచిన పోలింగ్ మెటీరియల్‌ను సోమవారం ఆయన పరిశీలించి మాట్లాడారు. పోలింగ్ కేంద్రాలకు పంపిణీ చేయనున్న బ్యాలెట్ బాక్సులు, ఎన్నికల సామగ్రిని సిద్ధంగా ఉంచాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రామలింగం, మేనేజర్ నరేశ్‌రెడ్డి, డీఈ కొండల్‌రావు, సిబ్బంది పాల్గొన్నారు.
బాధ్యతగా కౌంటింగ్ నిర్వహించాలి
సాక్షి, యాదాద్రి : మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను సంబంధిత అధికారులు బాధ్యతాయుతంగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ భాస్కర్ రావు సూచించారు. సోమవారం కలెక్టరేట్‌లో కౌంటింగ్ సిబ్బందికి ఇచ్చిన శిక్షణ కార్యక్రమంలో మాట్లాడారు. ప్రతి సిబ్బంది ఎన్నికల నియమావళిని కచ్చితంగా పాటిచాలన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ కృష్ణా రెడ్డి, జిల్లా విద్యా శాఖ అధికారి సత్యనారాయణ,మాస్టర్ ట్రైనర్స్ నర్సిరెడ్డి, హరినాథ్ రెడ్డి పాల్గొన్నారు. భువనగిరి మండలంలో దివ్య బాల స్కూల్ లో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ , రిసెప్షన్ సెంటర్ ఏర్పాట్లను స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు పరిశీలించారు.
యాప్‌లో యూరియా బుక్ చేసుకోవాలి
గుండాల: రైతులు ఫర్టిలైజర్ యాప్‌లో యూరియా బుక్ చేసి కొనుగోలు చేయాలని జిల్లా వ్యవసాయ అధికారి వెంకటరమణారెడ్డి కోరారు. సోమవారం గుండాలలో ఎరువుల దుకాణాలను తనిఖీచేశారు. స్టాక్ రిజిష్టర్లను పరిశీలించారు. అక్కడే ఉన్న రైతులతో మాట్లాడారు. జిల్లాలో ఉన్న రైతులందరికీ సరిపడా యూరియా ఉందని, ఎవరూ ఆందోళన చెంద వద్దన్నారు. యూరియా అమ్మకాలలో ఎటువంటి ఇబ్బందులు కలిగించ కూడదని డీలర్లు, సొసైటీ నిర్వాహకులను ఆదేశించారు. యాప్‌లో యూరియా బుక్ చేసుకోలేని రైతులకు ఏఈఓలు అందుబాటులో చేయించాలని సూచించారు. ఆయన వెంట ఆలేరు ఏడీఏ శ్రీని వాస్, మండల వ్యవసాయ అధికారి సూరజ్‌కుమార్, ఏఈఓ క్రాంతి, సిబ్బంది పాల్గొన్నారు.
ఉపకార వేతనాలకు దరఖాస్తు చేసుకోవాలి
రామన్నపేట: రాష్ట్ర ప్రభుత్వం షెడ్యూల్డ్ కులాలకు చెందిన విద్యార్థులకు అందించే ప్రీ మెట్రిక్ ఉపకార వేతనాలకు గడువులోగా దరఖాస్తు చేసుకోవాలని రామన్నపేట ఏఎస్సీడీఓ ఆర్.భిక్షం కోరారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో 5 నుంచి 8వ తరగతి చదివే ఎస్సీ బాలురకు ప్రభుత్వం సంవత్సరానికి రూ. 1000, బాలికలకు రూ .1500 చొప్పున ఉపకార వేతనం అందిస్తుందని తెలిపారు. అదే విధంగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో 9, 10 తరగతులు చదివే బాలబాలికలకు రాజీవ్ విద్యాదీవెన కింద ఏడాదికి రూ .3500 చొప్పున చెల్లిస్తుందని వివరించారు.
కేంద్రీయ విద్యాలయంలో ప్రేరణ ఉత్సవ్
భువనగిరి: భువనగిరి పట్టణ శివారులోని కేంద్రీయ విద్యాలయంలో సోమవారం ప్రేరణ ఉత్సవ్–26 సందర్భంగా జిల్లా స్థాయి పోటీలను ఘనంగా నిర్వహించారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు చెందిన సుమారు 50 మంది విద్యార్థులు వివిధ అంశాలలో నిర్వహించిన కవితలు, పాటలు, చిత్రలేఖనం, వ్యాసరచన వంటి పోటీల్లో ప్రతిభ కనబర్చారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ చంద్రమౌళి మాట్లాడారు. ప్రేరణ కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ ఏర్పడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ఎలాంటి పొరపాట్లు లేకుండా చూడాలి
ఎలాంటి పొరపాట్లు లేకుండా చూడాలి


