పారదర్శకంగా పోలింగ్ ప్రక్రియ
సాక్షి, యాదాద్రి : మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ హనుమంతరావు సూచించారు. సోమవారం కలెక్టరేట్‌లో మున్సిపల్ కమిషనర్లు, ఎన్నికల అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో అదనపు కలెక్టర్ భాస్కర్ రావు తో కలిసి కలెక్టర్ మాట్లాడారు. పోలింగ్ కేంద్రాల్లో తాగునీరు, విద్యుత్, ర్యాంపులు, మరుగుదొడ్లు వంటి మౌలిక వసతులు తప్పనిసరిగా కల్పించాలన్నారు. సమావేశంలో ఆర్డీఓలు కృష్ణా రెడ్డి, శేఖర్ రెడ్డి, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి నాగిరెడ్డి, అడిషనల్ డీఆర్‌డీఓ సురేష్, తహసీల్దార్ శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.
స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలి
మోత్కూరు : మున్సిపల్ ఎన్నికల్లో ఓటర్లు స్వేచ్ఛగా ఓటుహక్కును వినియోగించుకోవాలని కలెక్టర్ ఎం.హనుమంతరావు కోరారు. మోత్కూరు మున్సిపల్ కార్యాలయంలో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియను సోమవారం పరిశీలించారు. ఆయన వెంట ఎన్నికల ప్రత్యేక అధికారి గుర్రం సురేష్, మున్సిపల్ కమిషనర్ కె.సతీష్‌కుమార్, తహసీల్దార్ పి.జ్యోతి, ఎంపీడీఓ బాలాజీనాయక్, ఎంపీఓ పైళ్ల జనార్దన్‌రెడ్డి, పీఆర్ ఈఈ మంగులాల్, కమిషనర్ కె.సతీష్‌కుమార్, మేనేజర్ ప్రభాకర్ పాల్గొన్నారు.
ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి
భువనగిరిటౌన్ : ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ హనుమంత రావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 11 న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగే పోలింగ్‌కు ఏర్పాట్లు పూర్తయ్యాయని పేర్కొన్నారు.
వెబ్‌కాస్టింగ్‌కు పకడ్బందీ ఏర్పాట్లు
ఆలేరు: పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ హనుమంతరావు ఆదేశించారు. సోమవారం ఆలేరు మున్సిపాలిటీని సందర్శించారు. ఆయన వెంట తహసీల్దార్ ఆంజనేయులు, ఎంపీడీఓ సత్యాంజనేయప్రసాద్, వెంకటేష్, తిరుపతిరెడ్డి, జగన్‌మోహన్ పాల్గొన్నారు.
ఫ కలెక్టర్ హనుమంతరావు


