ప్రత్యేక గ్రీవెన్స్ రద్దు
భువనగిరిటౌన్ : మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో కోడ్ అమలులోకి వచ్చినందున ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు ప్రతి గురువారం నిర్వహించే ప్రత్యేక గ్రీవెన్స్, ఉద్యోగవాణి కార్యక్రమం రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ హనుమంతరావు మంగళవా రం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి వివిధ సమస్యల పై అర్జీలు ఇచ్చేందుకు కలెక్టరేట్ కు రావొద్దని కోరారు.
ఏఈఓ జేఏసీ జిల్లా అధ్యక్షుడిగా గోపినాథ్
మోత్కూరు : యాదాద్రి భువనగిరి జిల్లా వ్యవసాయ విస్తరణ అధికారుల(ఏఈఓ) జాయింట్ యాక్షన్ కమిటీ జిల్లా అధ్యక్షుడిగా మోత్కూరు క్లస్టర్ వ్యవసాయ విస్తరణ అధికారి తుంగ గోపినాథ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మంగళవారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన వ్యవసాయ విస్తరణ అధికారుల సమావేశంలో జాయింట్ యాక్షన్ కమిటీని ఎన్నుకున్నట్లు గోపినాథ్ తెలిపారు. ప్రధాన కార్యదర్శిగా జెస్సి, అసోసియేట్ ప్రెసిడెంట్‌గా ఎం.శ్రీనివాస్, వైస్ ప్రెసిడెంట్‌గా జె.నరేష్, కోశాధికారిగా పి.సాయి, ఆర్గనైజింగ్ సెక్రటరీగా సైదులు, అఫీషియల్ స్పోక్స్ పర్సన్‌గా అశోక్‌లను ఎన్నుకున్నట్లు వివరించారు.
క్షేత్రపాలకుడికి ఆకుపూజ
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి సన్నిధిలో మంగళవారం క్షేత్ర పాలకుడైన శ్రీఆంజనేయస్వామి వారికి అర్చకులు ప్రత్యేక పూజలు చేపట్టారు. విష్ణు పుష్కరిణి ఆవరణలో ఉన్న శ్రీఆంజనేయ స్వామికి అర్చక బృందం మన్య సూ క్త పారాయణంతో అభిషేకం నిర్వహించారు. సింధూరంతో అలంకరించిన హనుమంతుడికి వివిధ రకాల సుగంధం వెదజల్లే ద్రవ్యాల పూల మాలలతో అలంకరించి నాగవల్లి దలార్చన జరిపించారు. ఈ ఆకు పూజలో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. ఇక ప్రధానాలయంలో నిత్య కై ంకర్యాలు కొనసాగాయి.
అంగన్‌వాడీలకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలి
భువనగిరిటౌన్ : ఉద్యోగ విరమణ చేసిన అంగన్‌వాడీ టీచర్లకు రూ.2 లక్షలు, హెల్పర్ కు రూ.లక్ష రిటైర్మెంట్ బెనిఫిట్స్ వెంటనే ఇవ్వాలని తెలంగాణ అంగన్‌వాడీ టీచర్స్ – హెల్పర్స్ యూనియన్ (సీఐటీయూ) జిల్లా కమిటీ నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం యాదాద్రి కలెక్టరేట్‌లో ఏఓ జగన్, డీడబ్ల్యూఓ నర్సింహారావు లకు సమస్యలతో కూడిన వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా నాయకుడు పాండు మాట్లాడుతూ 18 నెలల క్రితం ప్రభుత్వం వయస్సు పైబడిన వారిని బలవంతంగా రాజీనామాలు చేయించి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వకపోవడం చాలా దారుణమన్నారు. వెంటనే రిటైర్మెంట్ అయినవారికి బెనిఫిట్స్ ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో అంగన్‌వాడీ యూనియన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బూరుగు స్వప్న, చిలువేరు రామాకుమారి, నాయకులు అంజమ్మ, లక్ష్మమ్మ, తులషమ్మ, వరలక్ష్మి పాల్గొన్నారు.
ఎంజీయూకు లా కాలేజీ మంజూరు
నల్లగొండ టూటౌన్ : నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీకి లా కాలేజీ మంజూరైంది. ఈ మేరకు ప్రభుత్వ ఉన్నత విద్యాశాఖ జీఓ 3ను మంగళవారం విడుదల చేసింది. మూడు సంవత్సరాల ఎల్‌ఎల్‌బీ కోర్సును 60 మంది విద్యార్థులతో ప్రారంభించుకునేందుకు అనుమతి ఇచ్చింది. ఎల్‌ఎల్‌ఎం 2 సంవత్సరాల కోర్సును కూడా మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రత్యేక గ్రీవెన్స్ రద్దు


