ఆరు మున్సిపాలిటీల్లోని 102 వార్డులకు నేడే పోలింగ్
న్యూస్‌రీల్
తెలంగాణలోకి దమ్మపాదయాత్ర
కర్ణాటక రాష్ట్రంలోని కలబురగలో ప్రారంభమైన దమ్మ పాదయాత్ర తెలంగాణలోని బుచ్చినెల్లికి చేరుకుంది.
హుండీ ఆదాయం రూ.4.03కోట్లు
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి హుండీ ఆదాయం రూ.4,03,02,821 వచ్చినట్లు అధికారులు తెలిపారు.
బుధవారం శ్రీ 11 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026
- IIలో
సాక్షి, యాదాద్రి : మున్సిపల్ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. బుధవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల్లో గల 104 వార్డుల్లో రెండు వార్డులు ఏకగ్రీవం కాగా 102 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 1,32,711 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఇందుకోసం 212 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రశాంతమైన వాతావరణంలో పోలింగ్ జరిగేలా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలింగ్ సిబ్బంది ఎన్నికల సామగ్రితో మంగళవారం సాయంత్రానికి తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. పోలింగ్‌కు పీఓలు, ఏపీఓలు, ఇతర పోలింగ్ సిబ్బంది 424 మంది, 20 శాతం రిజర్వును కలుపుకొని 1,020 మందిని నియమించారు. 212 బ్యాలెట్ బాక్సులను కేటాయించగా.. మరో 237 బాక్సులను రిజర్వులో ఉంచారు.
పోటీలో 353 మంది
భువనగిరి, చౌటుప్పల్, ఆలేరు, యాదగిరిగుట్ట, పోచంపల్లి, మోత్కూరు మున్సిపాలిటీల్లో 353 మంది పోటీలో ఉన్నారు. యాదగిరిగుట్ట పదవ వార్డులో బీఆర్‌ఎస్ అభ్యర్థి అవుల మమత, ఇండిపెండెంట్ అభ్యర్థి స్వప్నలు పోటీ నుంచి ఉపసంహరించుకోగా కాంగ్రెస్ అభ్యర్థి గుండ్లపల్లి వాణి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. చౌటుప్పల్‌లో 17 వ వార్డులో చింతల సాయిలు ఏకగ్రీవం అయ్యారు. భువనగిరిలో అత్యధికంగా 128 మంది పోటీ పడుతున్నారు. అత్యల్పంగా యాదగిరిగుట్టలో 38 మంది పోటీ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ 99 మంది అభ్యర్థులు, బీజేపీ 91, బీఆర్‌ఎస్ 90 మంది, ఇతరులు 73 మంది పోటీలో ఉన్నారు.
ఊహకందని విధంగా అభ్యర్థుల ఖర్చు
పోటీ చేస్తున్న అభ్యర్థులు ఓటర్లను ఆకర్శించేందుకు అన్ని రకాల ప్రలోభాలకు గురిచేస్తున్నారు. చైర్మన్, వైస్ చైర్మన్ రేసులో ఉన్న వారు తమ ఖర్చుతోపాటు పార్టీ అభ్యర్థుల ఖర్చులు భరిస్తున్నారు. దీంతో వారి ఖర్చు రూ.కోటిపైనే దాటుతోంది. ఒక్కో వార్డులో 1000 నుంచి 1400 వరకు ఓట్లు ఉన్నాయి. 90 శాతం మంది ఓటర్లకు డబ్బులు పంచుతున్నారు. అంతేకాకుండా చీరలు, వెండి భరిణేలు, నాణాలు, ప్రెషర్ కుక్కర్లు వంటి కానుకలు పంపిణీ చేశారు. ఓటర్లు కూడా అభ్యర్థులు ఇచ్చే తాయిలాలు అడిగి మరీ తీసుకుంటున్నారు. భువనగిరిలో ఓ ప్రఽతిపక్ష పార్టీ అభ్యర్థులు ఓటర్లకు చీర సారె అందజేస్తున్నారు. ఓటర్ల ఇంటికి వారిని పీటలపై కూర్చోపెట్టి బొట్టుపెట్టి కాళ్లు మొక్కుతున్నారు. మహిళలకు చీరలు, పురుషులకు మద్యం బాటిల్‌తో పాటు నగదు అందజేసి ఓటు అభ్యర్థిస్తున్నారు.
రూ.20వేలు పలుకుతున్న ఓటు
ఆలేరు, భువనగిరి, చౌటుప్పల్, యాదగిరిగుట్ట మున్సిపాలిటీల్లోని గట్టి పోటీ ఉన్న వార్డుల్లో ఒక్కో ఓటుకు రూ.20వేలు ఇస్తున్నట్లు తెలిసింది. చైర్మన్, వైస్ చైర్మన్ సీటుపై కన్నేసిన వారి వార్డుల్లో డబ్బు పంపిణీ తారాస్థాయికి చేరింది. చౌటుప్పల్‌లో ఓ అభ్యర్థి ఇచ్చిన డబ్బుల కంటే అధికంగా ఇస్తామని ప్రత్యర్థిగా ఉన్న మరో అభ్యర్థి చెబుతున్నారు. అయితే పలు వార్డుల్లో డబ్బులు ఇంకా పంచడంలేదని కొందరు ఓటర్లు అభ్యర్థులకు ఫోన్‌లు సైతం చేస్తుండడం గమనార్హం.
క్రాస్ ఓటింగ్ భయం
కాంగ్రెస్ పార్టీని క్రాస్ ఓటింగ్ భయం వెంటాడుతోంది. జిల్లాలోని అతి పెద్ద మున్సిపాలిటీ అయిన భువనగిరిలో బీఆర్‌ఎస్, బీజేపీల మధ్య ఓట్లు క్రాస్ అయ్యే అవకాశం ఉంది. తాము గెలువలేని చోట అధికార కాంగ్రెస్‌ను ఓడించేందుకు పరస్పరం ఓట్లు బదిలీ చేసుకునే విధంగా బీజేపీ, బీఆర్‌ఎస్‌ల మధ్యన లోపాయకారి అవగాహన ఉన్నట్లు చర్చ జరుగుతోంది. చైర్మన్ రేసులో ఉన్న అభ్యర్థులను ఓడించేందుకు సొంత పార్టీల్లోనే వెన్నుపోట్లు జరుగుతున్నట్లు పలువురు పేర్కొంటున్నారు.
టెన్షన్‌లో ప్రధాన పార్టీల అభ్యర్థులు
అభ్యర్థుల్లో టెన్షన్ పెరిగింది. ఓటర్ల నాడి దొరకడం లేదని ఓ అభ్యర్థి వాపోయాడు. పార్టీలకతీతంగా అభ్యర్థులు ఇస్తున్న డబ్బులు తీసుకుంటున్న ఓటరు తీర్పు ఏవిధంగా ఉంటుందో నన్న భయం వారిని వెంటాడుతోంది.
ఫ ఉదయం 7 గంటల నుంచి
సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్
ఫ 212 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు
ఫ భువనగిరిలో అత్యధికంగా 128 మంది, అత్యల్పంగా యాదగిరిగుట్టలో 38 మంది పోటీ
ఫ ఓటు హక్కు వినియోగించుకోనున్న 1,32,711 మంది ఓటర్లు
మున్సిపాలిటీలు వార్డులు పీఎస్‌లు ఓటర్లు బ్యాలెట్ బాక్సులు ఆలేరు 12 24 13632 58 భువనగిరి 35 72 47831 140 చౌటుప్పల్ 20 40 27216 98 మోత్కూర్ 12 26 14383 64 పోచంపల్లి 13 26 15827 31 యాదగిరిగుట్ట 12 24 13822 58
మొత్తం 104 212 1,32,711 449
ఆరు మున్సిపాలిటీల్లోని 102 వార్డులకు నేడే పోలింగ్
ఆరు మున్సిపాలిటీల్లోని 102 వార్డులకు నేడే పోలింగ్
ఆరు మున్సిపాలిటీల్లోని 102 వార్డులకు నేడే పోలింగ్
ఆరు మున్సిపాలిటీల్లోని 102 వార్డులకు నేడే పోలింగ్


