నిష్పక్షపాతంగా పనిచేయాలి
ఫ కలెక్టర్ హనుమంతరావు
భూదాన్‌పోచంపల్లి: మున్సిపల్ ఎన్నికల్లో అధికారులంతా సజావుగా, నిష్పక్షపాతంగా పనిచేయాలని కలెక్టర్ హనుమంతరావు అన్నారు. మంగళవారం భూదాన్‌పోచంపల్లి పట్టణ కేంద్రంలోని బాలాజీ ఫంక్షన్‌హాల్‌లో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని ఆయన సందర్శించారు. ప్రిసైడింగ్ అధికారులతో మాట్లాడి పలు సూచనలు చేశారు. స్వస్తిక్ గుర్తు, సీల్ వేసే ముందు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెరగాలన్నారు. ఓటర్లందరూ ఓటరు స్లిప్‌తో పాటు ఏదేని గుర్తింపుకార్డు తీసుకురావాలన్నారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు సహకరించాలని కోరారు. కలెక్టర్ వెంట ఎన్నికల కోఆర్డినేటర్ శ్రీనివాస్‌రెడ్డి, మున్సిపల్ కమిషనర్ అంజన్‌రెడ్డి, ఎంపీడీఓ రాపర్తి భాస్కర్, ఎంఆర్‌ఐ గుత్తా వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు.
లక్కారంలో ఎన్నికల సామగ్రి పంపిణీ పరిశీలన
చౌటుప్పల్ : మున్సిపాలిటీ పరిధిలోని లక్కారం గ్రామంలో ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాన్ని మంగళవారం కలెక్టర్ హనుమంతరావు సందర్శించి ఎన్నికల సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఆయన వెంట ఆర్డీఓ సాల్వేరు సూరజ్‌కుమార్, మున్సిపల్ కమిషనర్ గుత్తా వెంకట్రామ్‌రెడ్డి ఉన్నారు.


