ఉద్యోగ విరమణ సాయం ఇంకెప్పుడు? | - | Sakshi
Sakshi News home page

ఉద్యోగ విరమణ సాయం ఇంకెప్పుడు?

Feb 11 2026 8:57 AM | Updated on Feb 11 2026 8:57 AM

ఉద్యో

ఉద్యోగ విరమణ సాయం ఇంకెప్పుడు?

రిటైర్మెంట్‌ బినిఫిట్స్‌ ఇవ్వాలి

అడ్డగూడూరు : అంగన్‌వాడీ కేంద్రాల్లో టీచర్లు, ఆయాలుగా విధులు నిర్వహించి ఉద్యోగ విరమణ పొందిన వారికి సర్కారు నుంచి వచ్చే బెనిఫిట్స్‌ అందక నిరుత్సాహానికి గురువుతున్నారు. వృద్ధాప్యంతో ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న కొందరికి ఈ సాయం ఉపయోగడుతుందని ఆశించినా ప్రభుత్వం నుంచి స్పందన లేదు. అధికారులు, ప్రజాప్రతినిధులకు పలు మార్లు వినతిపత్రాలు ఇచ్చినా , ధర్నాలు చేస్తున్నా ఫలితం లేకుండాపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాయం పెంచుతూ కాంగ్రెస్‌ ప్రభుత్వం జీఓ జారీ చేసినా అమలుకాకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

సాయం పెంచుతూ జీఓ జారీ చేసినా..

చిన్నారులకు పూర్వ ప్రాథమిక విద్యతో పాటు గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అందిస్తూ వారి ఆరోగ్య సంరక్షణలో అంగన్‌వాడీ కేంద్రాల పాత్ర కీలకం. గత ప్రభుత్వ హయాంలో రిటైర్మెంట్‌ పొందిన టీచర్‌కు లక్ష రూపాయలు, ఆయాలకు రూ.50 వేలు ఇస్తామని ప్రకటించినా అమలుకు నోచుకోలేదు. అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలు 65 ఏళ్లకు ఉద్యోగ విరమణ పొందే విధానాన్ని 2024 ఏప్రిల్‌ నుంచి అమలు చేస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చాక టీచర్‌కు రూ.2 లక్షలు, ఆయాకు రూ . లక్ష రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ ఇస్తామని ప్రకటించి గతేడాది మే నెలలో జీఓ జారీ చేసింది. 65 ఏళ్లలోపు స్వచ్ఛందంగా విరమణ చేస్తే వారికీ ఇది వర్తింపజేస్తామని హామీ ఇచ్చింది. కానీ ఇప్పటి వరకు అమలు చేయడం లేదు.

కుటుంబాలు గడవక..

జిల్లాలో 2024 ఏప్రిల్‌ 30 నాటికి 65 ఏళ్లు నిండిన వారి వివరాలు అందించాలని ప్రభుత్వం కోరడంతో జిల్లా శిశు సంక్షేమ శాఖ అధికారులు పంపించారు. ఇప్పటివరకు జిల్లాలో ఉద్యోగ విరమణ పొందిన 20మంది టీచర్లు, 109 మంది ఆయాలు ఉన్నారు. వీరిలో కొందరు అనారోగ్యంతో సమతమవుతున్నారు. అటు ఉద్యోగం లేక ఇటు బెనిఫిట్స్‌ అందక, పింఛన్‌లేక కొందరు కుటుంబం గడవక ఆర్థికభారంతో ఇతరులపై ఆధారపడుతున్నారు.

నేను 42 ఏళ్లపాటు అంగన్‌వాడీ టీచర్‌గా పనిచేశాను. 2024 జూలైలో రిటైర్మెంట్‌ పొందాను. రూ.2లక్షలు వసాయని చెప్పారు. కానీ ఇంతవరకు ఒక్క రూపాయి కూడా రాలేదు. వృద్ధాప్యంలో ఆరోగ్యసమస్యలు తలెత్తుతున్నాయి. ఆర్థిక ఇబ్బందులతో అనేక సమస్యలు తలెత్తుతున్నాయి. ప్రభుత్వం స్పందించి రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ అందించాలి.

– పుష్పమ్మ, అంగన్‌వాడీ రిటైర్డ్‌ టీచర్‌, ఆజీంపేట

ఫ రెండేళ్లు కావొస్తున్నా అందని రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌

ఫ 20 మంది రిటైర్డ్‌ అంగన్‌వాడీ టీచర్లు, 109 మంది ఆయాలకు నిరీక్షణ

ఫ వృద్ధాప్యంలో ఆర్థికభారంతో సతమతం

ఉద్యోగ విరమణ సాయం ఇంకెప్పుడు?1
1/1

ఉద్యోగ విరమణ సాయం ఇంకెప్పుడు?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement