సబ్బండ వర్గాల అభివృద్ధే ధ్యేయం | - | Sakshi
Sakshi News home page

సబ్బండ వర్గాల అభివృద్ధే ధ్యేయం

Feb 11 2026 8:57 AM | Updated on Feb 11 2026 8:57 AM

సబ్బం

సబ్బండ వర్గాల అభివృద్ధే ధ్యేయం

ప్రభుత్వ విప్‌బీర్ల ఐలయ్య

యాదగిరిగుట్ట: సబ్బండ వర్గాల అభివృద్ధే ధ్యేయంగా కాంగ్రెస్‌ ప్రభుత్వం పనిచే స్తోందని ప్రభుత్వ విప్‌, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమంతో ఆలేరు, యాదగిరిగుట్ట మున్సిపాలిటీల్లో కాంగ్రెస్‌ జెండా ఎగురబోతుందని ధీమా వ్యక్తం చేశారు. జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లోనూ చైర్మన్‌ పీఠాలను కాంగ్రెస్‌ దక్కించుకుంటుందని పేర్కొన్నారు. గత పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనతో ప్రజలంతా ఆగమయ్యారని, ప్రజా పాలనలో ప్రజలంతా సంతోషంగా గడుపుతున్నారని పేర్కొన్నారు. ప్రతి ఇంటికి సంక్షేమ ఫలాలను అందిస్తూ అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. మున్సిపల్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థుల గెలుపునకు ప్రజా పాలనపై ప్రజలకు ఉన్న గెలుపే నిదర్శనమని పేర్కొన్నారు. ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు, వడ్డీ లేని రుణాలను అందజేయడంతో పాటు ప్రతి నిరుపేదకు ఇందిరమ్మ ఇల్లు, రేషన్‌ కార్డులను ప్రభుత్వం అందజేసిందని తెలిపారు. ప్రభుత్వాన్ని అండగా నిలిచేందుకు ప్రతి ఒక్కరు కాంగ్రెస్‌కు ఓటు వేసి గెలిపించాలని కోరారు.

కాంగ్రెస్‌ పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదు

మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత

యాదగిరిగుట్ట: రెండేళ్ల కాంగ్రెస్‌ పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదని ఆలేరు మాజీ ఎమ్మె ల్యే గొంగిడి సునీత మంగళవారం ఒక ప్రకటనలో తెలి పారు. యాదగిరిగుట్ట, ఆలేరు మున్సి పాలిటీలో బీఆర్‌ఎస్‌ అభ్యర్థులు అధిక స్థానాల్లో గెలువనున్నట్లు పేర్కొన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతతో పాటు ఇచ్చిన హామీలను నెరవేర్చని కాంగ్రెస్‌ పార్టీకి ఓటు వేయబోమని ఇప్పటికే ప్రజలు నిర్ణయించుకున్నారని తెలిపారు. కేసీఆర్‌ పాలన ఒక స్వర్ణ యుగం లాంటిదని, మళ్లీ కేసీఆర్‌ అధికారంలోకి రావాలంటే.. మున్సిపల్‌ ఎన్నికల్లో కేసీఆర్‌ సైనికులుగా బరిలో నిలిచిన బీఆర్‌ఎస్‌ అభ్యర్థులను అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ నాయకులు దొంగ హామీలను ఇస్తున్నారని, ప్రజలెవరూ వాటిని నమ్మొద్దని తెలిపారు. ఆలేరు, యాదగిరిగుట్ట మున్సిపాలిటీలను గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం హయాంలోనే అభివృద్ధి చేశామని, కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తరువాత అభివృద్ధిని విస్మరించిందని పేర్కొన్నారు. ఓటర్లు అంతా ఆలోచించి, ప్రజలను మభ్యపెడుతూ, ఇబ్బందులు పెడుతున్న కాంగ్రెస్‌కు ఈ ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలని పిలుపు నిచ్చారు. బీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని కోరారు.

సబ్బండ వర్గాల  అభివృద్ధే ధ్యేయం
1
1/1

సబ్బండ వర్గాల అభివృద్ధే ధ్యేయం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement