11న సెలవు
యాదగిరిగుట్ట: ఈనెల 11న పోలింగ్ రోజు స్థానిక సెలవు గా ప్రకటిస్తున్నట్లు కలెక్టర్ హనుమంతరావు వెల్లడించారు. సోమవారం యాదగిరిగుట్ట మున్సిపాలిటీలో బ్యాలెట్ బాక్సులను పరిశీలించి మాట్లాడారు. ఆ రోజు ప్రభుత్వ సంస్థల ఉద్యోగులకు సాధారణ సెలవు, షాపులు, సంస్థలు, ఫ్యాక్టరీల్లో పని చేస్తున్న ఉద్యోగులు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ రోజు వేతనంతో కూడిన సెలవు కల్పిస్తున్నట్లు తెలిపారు.ప్రైవేట్ సంస్థల్లో పని చేస్తున్న కార్మికులకు వేతనంతో కూడిన సెలవుగా ప్రకటించినట్లు చెప్పారు. ఎన్నికల నిర్వహణకు ఉపయోగించే ప్రభుత్వ భవనాలు, విద్యా సంస్థల భవనాలకు ఈనెల 10వ తేదీన పోలింగ్‌కు ముందు రోజు, 11వ తేదీన పోలింగ్ రోజు సెలవులు ప్రకటించినట్లు వివరించారు. 13న ఓట్ల లెక్కింపు సందర్భంగా కౌంటింగ్ కోసం వినియోగించే స్కూళ్లకు సెలవు ఇస్తున్నట్లు తెలిపారు.


