దేశాన్ని ఏకతాటిపైకి తెచ్చిన ‘వందేమాతరం’
భువనగిరి: దేశం మొత్తాన్ని ఏకతాటి పైకి తెచ్చిన గీతం వందేమాతరం అని సామాజిక వేత్తలు ఎర్ర నర్సింగ్, మంత్రిపెగడ శ్రీధర్‌లు అన్నారు. బుధవారం శ్రీ వివేకానంద సేవా సమితి ఆధ్వర్యంలో భువనగిరి ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో సామూహిక వందే మాతరం గీతాలాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారు మాట్లాడారు. నాటి దేశ భక్తులు వందేమాతరం గీతాన్ని ఆయుధంగా ఉపయోగించి దేశానికి స్వాతంత్య్రం తీసుకురావడానికి పోరాటం చేశారని గుర్తు చేశారు. నాటి పోరాట స్ఫూర్తితో నేటి తరం యువత, విద్యార్థులు దేశ భక్తిని పెంపొందించుకోవాలని కోరారు. భావిభారత పౌరులైన విద్యార్థులు రేపటి కోసం పర్యావరణ పరిరక్షణ, జల సంరక్షణ, విద్యుత్ పొదుపు చేసేందుకు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో వివేకానంద సేవా సమితి అధ్యక్షుడు బాదం ప్రకాష్, ప్రముఖ వ్యాపార వేత్తలు పసునూరి నాగభూషణం, మార్త వెంకటేశం, గడ్డం చంద్రశేఖర్, తొగిడి భాప్కర్, గణేష్, నాగరాజు, సూదగాని ఆంజనేయులు, కాసం సత్యనారాయణ, మెరుగు మహేష్, పబ్బతి సురేందర్, కన్నయ్య, శ్రీధర్, మెరుగు మధు, పాండు, సుర్వి మణికంఠ, చంద్రకాంత్, భరత్, సాయి కిరణ్, సంతోష్ పాల్గొన్నారు.


