పవర్‌లూమ్ కార్మికులకు త్రిఫ్టు పథకాన్ని కొనసాగించాలి
రాజాపేట : పవర్‌లూమ్ కార్మికులకు త్రిప్టు పథకాన్ని కొనసాగించాలని కోరుతూ రాజా పేట మండలంలోని రఘునాథపురం గ్రామానికి చెందిన పద్మశాలీ సంఘం నాయకులు గురువారం హైదరాబాద్‌లో చేనేత జౌళిశాఖ కమిషనర్ శైలజా రామయ్యర్‌కు వినతిపత్రం అందజేశారు. గత 10 నెలల క్రితం ముగిసిన త్రిఫ్టు పథకాన్ని పునరుద్ధరించాలని వారు కోరారు. చేనేత కార్మికుల మాదిరిగానే పవర్‌లూమ్ కార్మికులకు కూడా త్రిఫ్టు పథకాన్ని కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. తమిళనాడులో మరమగ్గాలకు 750 యూనిట్ల విద్యు త్ ఉచితంగా అందజేస్తున్నట్లు తెలంగాణ లోనూ చేనేతలకు 200 యూని ట్లు, పవర్‌లూమ్ పరిశ్రమకు 500 యూనిట్లు ఉచితంగా విద్యుత్ అందజేయాలని విన్నవించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ గాడిపల్లి శ్రవణ్‌కుమార్, నాయకులు సామల భాస్కర్, రేగొండ వెంకటేశం, గొట్టిపాముల సిద్దిరాములు, గోలి కిరణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.


