మళ్లీ కాంగ్రెస్‌దే అధికారం
భూదాన్‌పోచంపల్లి : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభంజనం వీస్తుందని, మళ్లీ అధికారంలోకి వచ్చేది కాంగ్రెసేనని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. శని వారం రాత్రి భూదాన్‌పోచంపల్లి పట్టణ కేంద్రంలోని 5వ వార్డులో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డితో కలిసి పాల్గొని మాట్లాడారు. స్థానిక ఎమ్మెల్యేకు సీఎం రేవంత్‌రెడ్డితో ఎంతో సాన్నిహిత్యం ఉందని, ఆ చొరవతోనే సీఎం ఆదేశాలతో తాను భువనగిరి, ఆలేరు నియోజకవర్గాలకు తాగునీటి పైప్‌లైన్ కోసం రూ.210 కోట్ల మంజూరు చేశానని గుర్తు చేశారు. అధికారంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని, మున్సిపల్ చైర్మన్ పదవి కూడా కాంగ్రెస్ గెలిస్తేనే అభివృద్ధి రెట్టింపు అవుతుందన్నారు. అభివృద్ధిపథంలో ముందుకు పోవాలంటే కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి తడక వెంకటేశ్వర్లు, వార్డు సభ్యులు బాత్క శంకర్‌యాదవ్, నల్ల నాగేశ్వర్, సూరెపల్లి రాధిక రమేశ్, కుడికాల రాంనర్సింహ, కొయ్యడ రజినిశ్రీను, గంజి జయమ్మగణేశ్, మంగళపల్లి లావణ్యరమేశ్, భోగ భానుమతి విష్ణు, దేవరాయ కుమార్, రావుల జంగయ్య, గుండ్ల నవనీత, ఎల్లస్వామి, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు భారత లవకుమార్, మండల అధ్యక్షుడు పాక మల్లేశ్, డీసీసీ ఉపాధ్యక్షుడు రాఘవరెడ్డి, సామ మధుసూధన్‌రెడ్డి, మర్రి నర్సింహారెడ్డి, సుధారాణి, మమత, కుక్క దానయ్య తదితరులు పాల్గొన్నారు.
పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క


