పులి సంచారంపై ఆందోళన వద్దు | - | Sakshi
Sakshi News home page

పులి సంచారంపై ఆందోళన వద్దు

Jan 29 2026 8:10 AM | Updated on Jan 29 2026 8:10 AM

పులి సంచారంపై ఆందోళన వద్దు

పులి సంచారంపై ఆందోళన వద్దు

తుర్కపల్లి : పులి సంచారంపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని యాదగిరిగుట్ట డీఎస్పీ పి. శ్రీనివాస్‌నాయుడు అన్నారు. తుర్కపల్లి మండలంలోని దత్తాయపల్లి, ఇబ్రహీంపూర్‌, దయ్యంబండతండా గ్రామాల్లో బుధవారం ఆయన అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ.. పులి మహరాష్ట్రలోని తిప్పేశ్వర్‌ అడవి నుంచి తప్పించుకుని గత 10 రోజులుగా తుర్కపల్లి ప్రాంతంలో సంచరిస్తోందని అన్నారు. అటవీశాఖ అధికారులు బోన్లు, డ్రోన్లు ఉపయోగించి పులిని తిరిగి రిజర్వ్‌ ఫారెస్ట్‌లోకి పంపేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. పులి పశువులపై మాత్రమే దాడి చేస్తుందని.. పఽశువుల కాపరులు, రైతులు అప్రమత్తంగా ఉండాలని, రాత్రివేళ బయటకు వెళ్లరాదని సూచించారు. పులి జాతీయ జంతువు కాబట్టి దానికి ఏవిధమైన హాని తలపెట్టినా నేరం అవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఐ ఎం. శంకర్‌, ఎస్‌ఐ మహ్మద్‌ తక్యుద్దీన్‌, డీఎఫ్‌ఆర్‌ఓ రమేష్‌నాయక్‌, జావీద్‌ హుస్సేన్‌, శ్రీనివాస్‌, మల్లేశం తదితరులు పాల్గొన్నారు.

ఫ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

ఫ డీఎస్పీ శ్రీనివాస్‌నాయుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement