బ్రహ్మోత్సవాలు పరిసమాప్తి
యాదగిరిగుట్ట: పూర్వగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఏడు రోజుల పాటు వైభవంగా కొనసాగిన వార్షిక బ్రహ్మోత్సవాలు మంగళవారం అష్టో త్తర శతఘటాభిషేకంతో ముగి శాయి. ఉదయం ఆలయంలో నిత్యారాధనల అనంతరం మూలవరులకు, ఉత్సవమూర్తులకు అష్టోత్తర శతఘటాభిషేకం నిర్వహించారు. తొలుత ఆలయ ప్రధాన మండపంలో 108 కలశాలను ఒకే చోట పెట్టి పూజించారు. అనంతరం కలశాల ఎదురుగా హోమం నిర్వహించి పూర్ణాహుతి చేపట్టారు. అనంతరం స్వామి పంచామృతాలను భక్తులకు తీర్థంగా ఇచ్చారు. ఈ వేడుకల్లో ఆలయ అనువంశిక ధర్మకర్త బి. నర్సింహమూర్తి, ఈఓ భవానీశంకర్, ఆలయ ప్రధానార్చకులు, ఉప ప్రధానార్చకులు, అధికారులు, వేద పారాయణికులు తదితరులు పాల్గొన్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా రద్దు చేసిన నిత్య కల్యాణం, సుదర్శన నారసింహ హోమం వంటి పూజలు బుధవారం పునఃప్రారంభం కానున్నాయి.
ఫ పాతగుట్టలో నేటి నుంచి
నిత్య కల్యాణం, సుదర్శన
నారసింహ హోమం
తిరిగి ప్రారంభం


