రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

Feb 10 2026 9:45 AM | Updated on Feb 10 2026 9:45 AM

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

భూదాన్‌పోచంపల్లి : బైక్‌పై వెళ్తున్న వ్యక్తిని గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో మృతిచెందాడు. ఈ ఘటన సోమవారం రాత్రి భూదాన్‌ పోచంపల్లి మండల కేంద్రం శివారులో జరిగింది. ఎస్‌ఐ భాస్కర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. సంస్థాన్‌ నారాయణపురం మండలం పుట్టపాక గ్రామానికి చెందిన కొంగరి శేఖర్‌(38) కొంతకాలంగా హైదరాబాద్‌లో నివాసముంటూ సమీప గ్రామాల్లో మార్బుల్‌ పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. సోమవారం మార్బుల్‌ పని మీద పోచంపల్లికి వచ్చిన అతడు పని ముగించుకొని రాత్రి బైక్‌పై తిరిగి ఇంటికి వెళ్తుండగా.. పోచంపల్లి మండల కేంద్రం శివారులో పోచంపల్లి–కొత్తగూడెం రహదారిలో శ్రీమిత్ర వెంచర్‌ సమీపంలోకి రాగానే ఎదురుగా వచ్చిన గుర్తుతెలియని వాహనం బైక్‌ను ఢీకొట్టింది. శేఖర్‌ బైక్‌ పైనుంచి కిందపడటంతో తల పగిలి అక్కడికక్కడే మృతిచెందాడు. వాహనదారులు గమనించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు ఘటనా స్థలానికి చేరుకొని పంచనామా నిర్వహించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement