బీబీనగర్‌లో వాకథాన్
భువనగిరి(బీబీనగర్): ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాల సందర్భంగా మంగళవారం బీబీనగర్‌లో లీడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో శ్రీకేవైసీ సురక్షిత బ్యాంకింగ్‌కు మీ మొదటి అడుగుశ్రీ అనే అంశంపై వాకథాన్ నిర్వహించారు. ఈ సందర్భంగా కేవైసీ ప్రాముఖ్యతతో పాటు, సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఆర్‌బీఎం ఏజీఎం లక్ష్మీశ్రావ్య, లీడ్ బ్యాంకు మేనేజర్ శివరామకృష్ణ, ఎంపీడీఓ శ్రీనివాస్‌రెడ్డి, పంచాయతీ కార్యదర్శి జకిరోద్దిన్, డీఆర్‌డీఓ సెర్ప్ డీపీఎం వెంకటేశం, ఏపీఎం మీనా, వివిధ బ్యాంకుల మేనేజర్లు, సిబ్బంది, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.


