విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే ఊరుకోం | - | Sakshi
Sakshi News home page

విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే ఊరుకోం

Feb 6 2026 8:41 AM | Updated on Feb 6 2026 8:41 AM

విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే ఊరుకోం

విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే ఊరుకోం

రామన్నపేట: వైద్యాధికారులు, సిబ్బంది విధుల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే ఊరుకోబోమని తెలంగాణ వైద్య విధాన పరిషత్‌ కమిషనర్‌ డాక్టర్‌ అజయ్‌కుమార్‌ హెచ్చరించారు. గురువారం రామన్నపేట ప్రభుత్వ ఆస్పత్రిని ఆయన తనిఖీ చేశారు. వార్డుల్లో పర్యటించి రోగులతో మాట్లాడారు. ఆస్పత్రిలో అందిస్తున్న వైద్యసేవలు, మందులు, డైట్‌, సిబ్బంది పనితీరును అడిగి తెలుసుకున్నారు. ఓపీ విభాగం, ఫార్మసీ, రిజిష్టర్లు, మెడిసిన్‌ స్టాకును పరిశీలించారు. అటెండెన్స్‌ రిజిష్టర్‌ను పరిశీలించి అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన ముగ్గురు డాక్టర్లకు షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యులు, సిబ్బంది బాధ్యతాయుతంగా పనిచేయాలని, మందులు అందుబాటులో ఉంచాలని సూచించారు. కాన్పుల సంఖ్య పెరిగే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆస్పత్రిస్థాయిని వంద పడకలకు పెంచాలని, నూతన భవనాలు నిర్మించాలని స్థానిక నేతలు కమిషనర్‌కు వినతిపత్రం సమర్పించారు. ఆయన వెంట డీసీహెచ్‌ఎస్‌ చిన్నానాయక్‌, వైద్యులు స్వాతీబాయి, నవీన్‌సింగ్‌, మాధవాచారి, దేవేందర్‌, సుమంగలి, హెడ్‌నర్సు సువర్ణ, సోలీ, జ్యోతి ఉన్నారు.

ఫ వైద్య విధాన పరిషత్‌ కమిషనర్‌ అజయ్‌కుమార్‌

ఫ విధులకు డుమ్మాకొట్టిన ముగ్గురు డాక్టర్లకు షోకాజ్‌ నోటీసులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement