కల్యాణ వైభోగమే..
కనుల పండువగా చెర్వుగట్టు రామలింగేశ్వరుడి కల్యాణం
నార్కట్‌పల్లి : నార్కట్‌పల్లి మండలం చెర్వుగట్టు పార్వతీ జడల రామలింగేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం తెల్లవారుజామున స్వామి, అమ్మవారి కల్యాణం అంగరంగ వైభవంగా సాగింది. కల్యాణం సందర్భంగా నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, పుష్ప దంపతులు పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను ప్రధాన మండపం నుంచి వృషభ వాహనంపై ఆలయ పురవీధుల గుండా ఊరేగిస్తూ కల్యాణ మండపానికి తీసుకొచ్చారు. కల్యాణ తంతును శైవాగమ పండితులు అల్లాపురం సుబ్రహ్మణ్య దీక్షితావధాని, ప్రధాన అర్చకుడు పోతులపాటి రామలింగేశ్వర శర్మ, కార్తీక్‌శర్మ, శ్రీకాంత్‌శర్మ, సురేష్‌శర్మ, సతీష్‌శర్మ అర్చక బృందం మంత్రోచ్చారణల నడుమ మాఘశుద్ధ రథసప్తమి గడియల్లో నిర్వహించారు. ఉదయం 6,15 గంటలకు జీలకర బెల్లం, 6.40 గంటలకు మాంగళ్యధారణ గావించారు. స్వామివారి కల్యాణాన్ని తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. స్వామి అమ్మవార్లకు వడి బియ్యం సమర్పించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏఎస్పీ రవి, డీఎస్పీ శివరాంరెడ్డి పర్యవేక్షణలో సుమారు 600 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
పవిత్రమైన క్షేత్రం చెర్వుగట్టు : ఎమ్మెల్యే
శ్రీశైలం తర్వాత అంతటి ప్రవితమైన శివక్షేత్రం చెర్వుగట్టు దేవాలయమని ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. స్వామి వారి కల్యాణం అనంతరం ఆయన మాట్లాడారు. ప్రజలందరికీ మంచి జరగాలని ఆ శివయ్యను కోరుకున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ భాస్కర్, ఈఓ మోహన్‌బాబు, ఉత్సవ కమిటీ చైర్మన్ వరాల రమేష్, సర్పంచ్ నేతగాని కృష్ణ, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బత్తుల ఉషయ్య, గడుసు శశిధర్‌రెడ్డి, వడ్డె భూపాల్‌రెడ్డి, పున్నపురాజ యాదగిరి, రేగట్టె రాజశేఖర్‌రెడ్డి, రేగట్టె నవీన్‌రెడ్డి, నర్సిరెడ్డి, ఉప సర్పంచ్ జలేందర్‌రెడ్డి, కమ్మలపల్లి మల్లేశం, ప్రజ్ఞాపురం సత్యనారాయణ, సంపత్, శ్రీనివాస్‌రెడ్డి, యాదయ్య, రంగ శ్రవణ్, నరసింహ, కొమ్ము శ్రీను, గౌరుదేవి లక్ష్మయ్య, గడ్డం పశుపతి, సూర ఆంజనేయులు ఉన్నారు.
ఫ మాఘశుద్ధ ఘడియల్లో ఒక్కటైన స్వామి, అమ్మవారు
ఫ పట్టు వస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యే వీరేశం దంపతులు
ఫ ఒడి బియ్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్న భక్తులు
కల్యాణ వైభోగమే..


