ముస్తాబైన సమ్మక్క–సారలమ్మ
పెన్‌పహాడ్: మండల పరిధిలోని గాజుమల్కాపురంలో సమ్మక్క–సారలమ్మ జాతర బుధవారం నుంచి ప్రారంభంకానుంది. 31వ తేదీ వరకు ఉత్సవాలు నిర్వహించనున్నారు. గ్రామ పూజారి కృష్ణంరాజు ఇంట్లో ఉన్న సమ్మక్క సారలమ్మలను బుధవారం ఊరేగింపుగా గద్దెలపైకి తీసుకురానున్నారు. నాలుగు రోజుల పాటు వైభవంగా జరగనున్న ఉత్సవాల్లో భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ కమిటీ చైర్మన్ బండి మధుసూదన్‌రెడ్డి తెలిపారు. జాతర సందర్భంగా తెలుగు రాష్ట్రాల స్థాయి కోలాటం, డాన్స్ పోటీలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
ముస్తాబైన సమ్మక్క–సారలమ్మ


