నిబంధనలు పాటించాలి
భువనగిరిటౌన్ : మున్సిపాలిటీల్లో ఎన్నికల నిబంధనలు పాటించాలని రాష్ట్ర ఎలక్షన్ అబ్జర్వర్ గౌతమి సూచించారు. బుధవారం భువనగిరి మున్సిపాలిటీని ఆమె సందర్శించారు. నామినేషన్ల ప్రక్రియను ఆమె పరిశీలించారు. నామినేషన్ కౌంటర్లు, హెల్ప్‌డెస్క్‌లతో పాటు, భద్రతపై ఆమె మున్సిపల్ కమిషనర్ రామలింగంను అడిగి తెలుసుకొని మాట్లాడారు., ఎవరికీ ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.
గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలు
భువనగిరి : గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలని డీఈఓ సత్యనారాయణ అన్నారు. బుధవారం భువనగిరి పట్టణంలోని బీచ్ మహల్లా ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మరో గ్రంథాలయ ఉద్యమం బస్సు యాత్ర పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. ప్రతి ఒక్కరూ పుస్తక పఠనాన్ని అలవాటు చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో బస్సు యాత్ర నిర్వాహకుడు కస్తూరి ప్రభాకర్, ఎంఈఓ నాగవర్దన్‌రెడ్డి, తెలంగాణ సాహితీ సంస్థ జిల్లా అధ్యక్షుడు జిట్టా భాస్కర్‌రెడ్డి, జన విజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షుడు కొడారి వెంకటేశం, నాయకులు బట్టుపల్లి రాంచంద్రయ్య, పాఠశాల హెచ్‌ఎం భాస్కర్, ఉపాధ్యాయులు లక్ష్మీనరసింహరెడ్డి, వెంకన్న , సుదర్శన్‌రెడ్డి, అలివేలు తదితరులు పాల్గొన్నారు.
ప్రధానోపాధ్యాయుడికి
ప్రశంసా పత్రం అందజేత
పట్టణంలోని బీచ్ మహల్లా ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మేడి భాస్కర్ విద్యాభివృద్ధికి చేసిన సేవలకు గుర్తింపుగా డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ నవీన్ నికోలస్ ప్రశంసా పత్రం జారీ చేశారు. బుధవారం భాస్కర్‌కు డీఈఓ సత్యనారాయణ ప్రశంసా పత్రం అందజేసి సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ నాగవర్దన్‌రెడ్డి, ప్రధానోపాధ్యాయుడు రవికుమార్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
యాదగిరి క్షేత్రంలో సంప్రదాయ పూజలు
యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో సంప్రదాయ పూజలు కొనసాగాయి. బుధవారం వేకువజామునే ఆలయాన్ని తెరిచిన అర్చకులు శ్రీస్వామి అమ్మవార్లకు సుప్రభాతం జరిపించారు. అనంతరం స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులకు నిజాభిషేకం, తులసీ దళాలతో అర్చన వంటి పూజలు చేపట్టారు. ఇక ఆలయ ప్రథమ ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, గజ వాహన సేవ, నిత్య కల్యాణం, బ్రహ్మోత్సవం వంటి కై ంకర్యాలను భక్తులచే నిర్వహించారు. ముఖ మండపంలో సువర్ణ పుష్పార్చన మూర్తులకు అష్టోత్తర పూజలు భక్తులచే జరిపించారు. సాయంత్రం వేళ ఆలయ తిరు, మాడ వీధుల్లో జోడు సేవను ఊరేగించారు. వివిధ పూజల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు.
త్రిశక్తి ఆలయంలో పూజలు
వలిగొండ : మండల కేంద్రంలోని శ్రీ హరిహర త్రిశక్తి ఆలయంలో 12వ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం చండీ పారా యణం, చండీ ఆవరణార్చన, చండీ హో మం, ఆంజనేయస్వామికి అభిషేకం, మ న్యుసూక్త సంపుటి పారాయణం, విశాలాక్షి వారి శిష్య బృందం ఆధ్వర్యంలో శివానంద లహరి, సౌందర్యలహరి, కాలభైరవ అష్టకం వంటి పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. అనంతరం ఆలయ నిర్వాహకులు భక్తులకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో బిన్నూరు గోపాలకృష్ణశాస్త్రి, కమలాకర్ శర్మ, శ్రీనివాస్ గుప్తా, అనురాధ, మనోహరి, లక్ష్మీనారాయణ శాస్త్రి, దత్తాత్రేయ పాల్గొన్నారు.
నిబంధనలు పాటించాలి
నిబంధనలు పాటించాలి


