నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయడమే లక్ష్యం
చౌటుప్పల్ : అన్ని రకాల విద్యుత్ వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్‌ను సరఫరా చేయడమే తమ లక్ష్యమని టీజీఎస్పీడీసీఎల్ రూరల్ జోన్ చీఫ్ ఇంజనీర్ యు.బాలస్వామి తెలిపారు. విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రజాబాట కార్యక్రమంలో భాగంగా మంగళవారం స్థానిక ప్రజాప్రతినిధులు, విద్యుత్ అధికారులతో కలిసి చౌటుప్పల్ మండల పరిధిలోని ఆరెగూడెంలో ఆయన పర్యటించారు. గ్రామంలోని ట్రాన్స్‌ఫార్మర్లను పరిశీలించారు. గ్రామసర్పంచ్ ఎన్నేపల్లి ధనలక్ష్మి వెంకట్‌రెడ్డితోపాటు వినియోగదారులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పంతంగి విద్యుత్ సబ్‌స్టేషన్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన ఆరెగూడెం, కాట్రేవు గ్రామాల 11కేవీ వ్యవసాయ ఫీడర్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ లైన్లు, స్తంభాలను త్వరలోనే మార్పిస్తామన్నారు. ఎలాంటి సమస్య లేకుండా సాఫీగా విద్యుత్ సరఫరా చేయాలన్న ఉద్దేశంతో ప్రజాబాట కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. సమస్యలుంటే వినియోగదారులు తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. ప్రత్యేక ఫీడర్ ఏర్పాటుతో రైతులు ఆనందర వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఎన్నేపల్లి ధనలక్ష్మివెంకట్‌రెడ్డి, ట్రాన్స్‌కో డీఈ మల్లికార్జున్, ఏడీఈ పద్మ, ఏఈ రాజుల సతీష్‌కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.
ఫ టీజీఎస్పీడీసీఎల్ రూరల్ జోన్ చీఫ్ ఇంజనీర్ బాలస్వామి


