ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా
భువనగిరి(బీబీనగర్): ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేస్తామని తెలంగాణ పంచాయతీరాజ్ మినిస్టీరియల్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఏపాల సత్యనారాయణ తెలిపారు. బుధవారం బీబీనగర్ మండల ప్రజాపరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించిన సంఘం జిల్లా సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎప్పటికప్పుడు ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడంతో సంఘం ముందంజలో ఉంటుందన్నారు. కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షుడు పి. శ్రీకాంత్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి అంబటి హరిశివకుమార్, కోశాధికారి కల్లు రమేష్‌రెడ్డి, గడ్డం జ్ఞానప్రకాష్‌రెడ్డి, కోల్పుల రమేష్, రచ్చ ప్రభాకర్‌రెడ్డి పాల్గొన్నారు.


