టికెట్ వచ్చిందో రాలేదో తెలియక..
మిర్యాలగూడ టౌన్ : మిర్యాలగూడ మున్సిపల్ 48వ వార్డు జనరల్ మహిళకు రిజర్వ్ అయ్యింది. ఈ వార్డు నుంచి కాంగ్రెస్ తరఫున పందిరి అనిత, మెరుగు అభిభి నామినేషన్ వేశారు. అయితే ఇద్దరికీ కాంగ్రెస్ బీ ఫాం ఇచ్చారంటూ పుకార్లు రావడంతో పందిరి అనిత మంగళవారం కొద్దిసేపు నామినేషన్ సెంటర్ వద్ద హల్‌చల్ చేసింది. తనకు టికెట్ వచ్చిందో రాలేదో తెలియాలని పట్టుబట్టి నిరసన వ్యక్తం చేసింది. సుమారు గంటకు పైగా నిరసన వ్యక్తం చేయడంతో పోలీసులు ఆమెను బయటకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. అయితే లిస్ట్‌లో తన పేరు వచ్చే వరకు తాను అక్కడే ఉంటానంటూ భిష్మించింది. చివరికి 48వ వార్డు నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఆమె పేరు ఉండటంతో అక్కడి నుంచి వెళ్లిపోయింది.


