కాంగ్రెస్‌ విజయం ఖాయం | - | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ విజయం ఖాయం

Feb 6 2026 7:21 AM | Updated on Feb 6 2026 7:21 AM

కాంగ్రెస్‌ విజయం ఖాయం

కాంగ్రెస్‌ విజయం ఖాయం

ఆలేరు: జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల్లో కాంగ్రెస్‌ విజయం ఖాయమని మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు ధీమా వ్యక్తం చేశారు. బుధవారం ఆలేరులో ప్రభుత్వ విప్‌ బీర్ల ఐలయ్యతో కలిసి విలేకరులతో మాట్లాడారు. ప్రస్తుతం రాజకీయాలు డబ్బుల మయమయ్యాయని తాను ఎమ్మెల్యేగా మళ్లీ పోటీ చేసే ఆలోచన లేదని..భవిష్యత్‌లో దేవుడు,కాలం ఏం నిర్ణయిస్తుందో చెప్పలేనన్నారు.ఈ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు ఎందుకు ఓటు వేయాలో ప్రజలు ఆలోచించాలని కోరారు.

గొంగిడిపై ప్రభుత్వ విప్‌ ఫైర్‌

అభ్యర్థులను బెదిరిస్తున్నట్టు డీసీసీబీ మాజీ చైర్మన్‌ గొంగిడి మహేందర్‌రెడ్డి చేసిన ఆరోపణలను ప్రభుత్వ విప్‌ బీర్ల ఐలయ్య ఖండించారు. యాదగిరిగుట్టలో ఆరుగురు, ఆలేరులో ఆరుగురు బీఆర్‌ఎస్‌ అభ్యర్థులు తనతో టచ్‌లో ఉన్నట్టు, ఇంటికి వచ్చినట్టు సీసీ ఫుటేజీ ఉందన్నారు. తనకు జూబ్లీహిల్స్‌లో రూ.40కోట్ల ప్రాపర్టీ ఉన్నట్టు నిరూపిస్తే ఆలేరు ప్రజలకు రాసిస్తానని స్పష్టం చేశారు. సమావేశంలో రాష్ట్ర మహిళా అభివృద్ధి సహకార సంస్థ చైర్‌పర్సన్‌ బండ్రు శోభారాణి, డీసీసీ మాజీ అధ్యక్షుడు సంజీవరెడ్డి, మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు నీలం పద్మ, బ్లాక్‌ అధ్యక్షుడు యాదగిరిగౌడ్‌, పట్టణ అధ్యక్షులు ఇజాజ్‌, సాగర్‌రెడ్డి, విజయ్‌కుమార్‌, జైనొద్దీన్‌, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు చెక్క వెంకటేష్‌ తదితరులు పాల్గొన్నారు.

ఫ నాకు ఎమ్మెల్యేగా పోటీచేసే ఆలోచనలేదు

ఫ బీఆర్‌ఎస్‌కు ఎందుకు ఓటేయాలో ఆలోచించాలి

ఫ మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement