రాచరికం toప్రజాస్వామ్యం
భువనగిరి పట్టణానికి ఘనమైన చరిత్ర
ఫ ఎందరో ఉద్ధండులను అందించిన ప్రాంతం ఫ మున్సిపల్ చరిత్రలో అవిశ్వాసాలే అధికం
భువనగిరి మున్సిపాలిటీకి ఘనమైన చరిత్ర
ఉంది. ఒకప్పుడు రాచరిక పాలనలో ఉన్న
ప్రాంతం నేడు ప్రజాపాలనలో కొనసాగుతోంది. అతిపురాతనమైన నగరంగా దీనికి పేరుంది. శాతవాహనుల నుంచి కల్యాణ చాళుక్య చక్రవర్తి, త్రిభువన మల్ల విక్రమాదిత్య, కాకతీయ రాజులు, కుతుబ్‌షాహీలు, మొఘలులు, సర్వాయిపాపన్న వంటి ఉద్ధండులు భువనగిరిని పాలించారు.
అందుకు సాక్షంగా ఉన్న ఖిలా, చారిత్రక సంపద నేటికీ సందర్శకులను ఆకర్షిస్తోంది. 1952లో పురపాలక సంఘంగా ఏర్పడింది. ప్రస్తుతం 35 వార్డులతో మున్సిపాలిటీ విస్తరించి ఉంది.
– సాక్షి, యాదాద్రి
క్ర.సం చైర్మన్ పేరు సంవత్సరం పార్టీ
1 ఎండీ. అబ్బాస్‌అలీ – –
2 అబ్దుల్‌రహమాన్ చిస్తీ – –
3 పట్నం వెంకటనర్సయ్య – కాంగ్రెస్
4 పాదరాజు హన్మంతరావు – –
5 సున్నం యాదగిరి 1981 కాంగ్రెస్
6 డాకూరి కృష్ణ 1983 కాంగ్రెస్
7 సున్నం యాదగిరి 1985 టీడీపీ
8 ఏవీ శివనాగేందర్ 1989 టీడీపీ
9 హబీబ్ రహమాన్ చిస్తీ 1992 టీడీపీ
10 ఊట్కూరి దామోదర్‌గౌడ్ 1995 కాంగ్రెస్
11 పెంట నర్సింహ 2000–05 టీడీపీ
12 దొనకొండ వనిత 2005– 08 కాంగ్రెస్
13 కొలుపుల కమలాకర్ 2008–09 కాంగ్రెస్
14 బర్రె జహంగీర్ 2009–10 కాంగ్రెస్
15 సుర్వి లావణ్య 2014–18 బీజేపీ
16 నువ్వుల ప్రసన్న 2018–19 టీఆర్‌ఎస్
17 ఏనబోయిన ఆంజనేయులు 2020– 23 టీఆర్‌ఎస్
18 పోతంశెట్టి వెంకటేశ్వర్లు 2023– 25 కాంగ్రెస్
2011 జనాభా లెక్కల ప్రకారం భువనగిరి మున్సిపాలిటీలో 59,844 మంది జనాభా ఉంది. ఇందులో 30,265 మంది పురుషులు కాగా 29,579 మంది మహిళలు. 2019లో తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త మున్సిపల్ చట్టం ప్రకారం భువనగిరి మున్సిపాలిటీలో వార్డుల సంఖ్య పెరిగింది. బొమ్మాయపల్లి, రాయిగిరి, పగిడిపల్లి గ్రామపంచాయతీలను మున్సిపాలిటీలో విలీనం చేశారు. దాంతో గతంలో వార్డుల సంఖ్య 30 నుంచి 35కు పెరిగింది. ఓటర్ల సంఖ్య కూడా పెరిగింది. 2014లో భువనగిరి మున్సిపాలిటీలో 35, 326 మంది ఓటర్లు ఉండగా 2019లో 44,240కు పెరిగింది. ప్రస్తుతం ఓటర్ల సంఖ్య 47,831గా నమోదైంది.
2005లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధిక వార్డులను గెలుచుకుంది. మున్సిపల్ చైర్మన్ స్థానం ఎస్సీ జనరల్‌కు రిజర్వు కాగా కాంగ్రెస్‌కు చెందిన దొనకొండ వనిత చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు. 2008లో కౌన్సిలర్లు ఆమైపె అవిశ్వాసం పెట్టడంతో పదవి కోల్పోయారు. వైస్ చైర్మన్‌గా ఉన్న కొలుపుల కమలాకర్ ఇన్‌చార్జి చైర్మన్‌గా సంవత్సరం పాటు కొనసాగారు. 2009లో కాంగ్రెస్‌కు చెందిన బర్రె జహంగీర్‌ను చైర్మన్‌గా ఎన్నుకున్నారు. 2014లో టీడీపీ పొత్తుతో బీజేపీకి చెందిన సుర్వి లావణ్య చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు. 2018లో ఆమైపె అవిశ్వాసం పెట్టడంతో పదవి కోల్పోయారు. అనంతరం బీఆర్‌ఎస్‌కు చెందిన నువ్వుల ప్రసన్న చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు. 2020లో బీఆర్‌ఎస్‌కు చెందిన ఏనబోయిన ఆంజనేయులు చైర్మన్‌గా ఎన్నికవగా 2023లో అవిశ్వాసంతో ఆయన పదవి కోల్పోయారు. తర్వాత కాంగ్రెస్‌కు చెందిన పోతంశెట్టి వెంకటేశ్వర్లు చైర్మన్ అయ్యారు.
మున్సిపల్ చైర్మన్‌గా పనిచేసిన వారు
వెంకటనర్సయ్య
దామోదర్‌గౌడ్
అబ్దుల్ రహమాన్
దొనకొండ వనిత
పెంట నర్సింహ
హబీబ్ రహమాన్
శివనాగేందర్
డాకూరి కృష్ణ
కమలాకర్
వెంకటేశ్వర్లు
ఆంజనేయలు
నువ్వుల ప్రసన్న
బర్రె జహంగీర్
సుర్వి లావణ్య
ముఖచిత్రం
భువనగిరి మున్సిపాలిటీలో ఓటర్ల సంఖ్య
సంవత్సరం పురుషులు మహిళలు మొత్తం
2014 17612 17714 35326
2019 21635 22605 44240
2026 23037 24793 47831
రాచరికం toప్రజాస్వామ్యం
రాచరికం toప్రజాస్వామ్యం
రాచరికం toప్రజాస్వామ్యం
రాచరికం toప్రజాస్వామ్యం
రాచరికం toప్రజాస్వామ్యం
రాచరికం toప్రజాస్వామ్యం
రాచరికం toప్రజాస్వామ్యం
రాచరికం toప్రజాస్వామ్యం
రాచరికం toప్రజాస్వామ్యం
రాచరికం toప్రజాస్వామ్యం
రాచరికం toప్రజాస్వామ్యం
రాచరికం toప్రజాస్వామ్యం
రాచరికం toప్రజాస్వామ్యం
రాచరికం toప్రజాస్వామ్యం
రాచరికం toప్రజాస్వామ్యం


