ఓటు వేసేందుకు వస్తూ వ్యక్తి మృతి
హుజూర్‌నగర్ : ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఒంగోలు నుంచి వస్తూ వ్యక్తి మృతి చెందినదిన ఘటన ఏపీలోని ఒంగోలు జిల్లా చీరాల వద్ద మంగళవారం తెల్లవారు జామున జరిగింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. హుజూర్‌నగర్ మున్సిపాలిటీ పరిధిలోని యర్రగుట్టకు చెందిన గునగంటి నాగేశ్వరరావు (40) బతుకుదెరువు కోసం ఆంధ్రప్రదేశ్‌లోని ఒంగోలుకు వెళ్లాడు. మున్సిపల్ ఎన్నికల్లో ఓటు వేసేందుకు సోమవారం ఒంగోలు నుంచి రైలులో బయలు దేరాడు. రాత్రి చీరాల వద్ద శవమై కనిపించాడు. ప్రమాదవశాత్తు రైలునుంచి జారిపడి మృతిచెంది ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. రైల్వే పోలీసులు గుర్తించి బంధువులకు సమాచారం ఇచ్చారు. నాగేశ్వరరావుకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.


