దేశంలో మొదటగా ‘పేట’లోనే.. | - | Sakshi
Sakshi News home page

దేశంలో మొదటగా ‘పేట’లోనే..

Feb 1 2026 7:30 AM | Updated on Feb 1 2026 7:30 AM

దేశంల

దేశంలో మొదటగా ‘పేట’లోనే..

దేశ వ్యాప్తంగా ఖ్యాతి విదేశాల్లో అధ్యయనం అదనపు సిబ్బంది నియామకం

సుప్రీంకోర్టు ప్రశంసలు

సూర్యాపేట : తడి, పొడి చెత్తను వేరు చేసి సేకరించే వినూత్న పద్ధతికి శ్రీకారం చుట్టిన సూర్యాపేట మున్సిపాలిటీ జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. 2004లో దేశంలోనే ఉత్తమ మున్సిపాలిటీ అవార్డును అందుకుంది. సూర్యాపేటలో అనుసరించిన ఈ విధానాన్ని ప్రస్తుతం దేశ వ్యాప్తంగా అన్ని మున్సి పాలిటీల్లో అమలు చేస్తున్నారు. వివిధ విభా గాల్లో ఉత్తమ పనితీరు ప్రదర్శించడంతో మరో మూడు జాతీయ అవార్డులు అందుకుంది.

సూర్యాపేట మున్సిపాలిటీ అభివృద్ధిలో వినూత్న విధానాలు అమలు చేస్తూ దేశవ్యాప్తంగా ఖ్యాతిని ఆర్జించింది. దేశంలో ఏ మున్సిపాలిటీ అమలు చేయని విధంగా తడి, పొడి చెత్త విధానాన్ని మొదటి సారిగా సూర్యాపేటలో అమలు చేశారు. దాంతో పాటు దానిని పకడ్బందీగా నిర్వహించడం, సేకరించిన చెత్తను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్రాంతానికి తరలించడం వంటి చర్యల ద్వారా ఈ విధానం జాతీయ స్థాయిలో అందరినీ ఆకర్షించింది. దాంతో పాటు సుప్రీం కోర్టు కూడా మున్సిపాలిటీ కృషిని ప్రసంసించింది.

జుట్టుకొండ సత్యనారాయణ రెండు పర్యాయాలు (1995– 2000, 2000–2005 వరకు) బీజేపీ కౌన్సిలర్‌గా గెలిచిన టీడీపీ మద్దతుతో సూర్యాపేట మున్సిపల్‌ చైర్మన్‌గా పని చేశారు. ఆయన రెండో సారి చైర్మన్‌గా ఎన్నికై న సమయంలో దేశంలో ఎన్డీయే ప్రభుత్వం, రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉంది. విదేశాల్లో జరుగుతున్న పట్టణాభివృద్ధిపై అధ్యయనం చేసేందుకు 2వేల సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం సంబంధిత శాఖ మంత్రి, ఉన్నతాధికారులు, మున్సిపల్‌ చైర్మన్లు, కమిషనర్లతో కూడిన బృందాన్ని ఽథాయిలాండ్‌, సింగపూర్‌, బ్యాంకాక్‌, ఇండోనేషియాకు పంపించింది. ఈ బృందం 15 రోజుల పాటు పర్యటించింది. దాంతో పాటు ట్రాన్స్‌పోర్ట్‌, ట్రాఫిక్‌, డ్రింకింగ్‌ వాటర్‌, పట్టణ ప్రగతిని పరిశీలించేందుకు 2002లో చైనా, హంకాంగ్‌, థాయిలాండ్‌ దేశాలకు బృందాన్ని పంపించింది. ఈ రెండుసార్లు కూడా సూర్యాపేట మున్సిపల్‌ చైర్మన్‌గా ఉన్న జుట్టుకొండ సత్యనారాయణకు అవకాశం దక్కింది.

వివిధ దేశాల్లో పట్టణాభివృద్ధిని పరిశీలించి వచ్చిన జుట్టుకొండ సత్యనారాయణ సూర్యాపేట మున్సిపాలిటీని పరిశుభ్రంగా మార్చేందుకు చెత్త సేకరణ చేయాలని నిర్ణయించారు. అందులోనూ తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించి వీధులను పరిశుభ్రంగా ఉంచాలని నిర్ణయించారు. అందులో భాగంగా అప్పట్లో రూ.50 లక్షల నిధులతో 8 ట్రాక్టర్లను కొనుగోలు చేశారు. అప్పటికి మున్సిపాలిటీలో ఉన్న 100 మంది రెగ్యులర్‌ సిబ్బందితో పాటు మరో 150 మంది ఔట్‌సోర్సింగ్‌ సిబ్బందిని నియమించారు. వీతో పట్ణణంలోని ప్రతి వీధికి, ప్రతి ఇంటికీ ట్రాక్టర్‌లో తిరుగుతూ విజిల్‌ వేస్తూ మరీ తడి, పొడి చెత్తలను సేకరించారు. ఇందుకోసం ప్రతి ఇంటికి రెండు రకాల చెత్త బుట్టలను పంపిణీ చేశారు. దాంతో పాటు పచ్చదనం, పరిశుభ్రత వంటి వాటిపై ప్రజలకు అవగాహన కల్పించారు. దేశంలోనే మొట్ట మొదటిసారిగా ఈ విధానాన్ని అమలు చేసిన సూర్యాపేట మున్సిపాలిటీకి 2004లో జాతీయ ఉత్తమ మున్సిపాలిటీ అవార్డు దక్కింది. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి చేతుల మీదుగా అప్పటి కమిషనర్‌ ఖాదర్‌సాబ్‌ అవార్డును అందుకున్నారు.

తడి, పొడి చెత్త విధానంలో సూర్యాపేట మున్సిపాలిటీ చేస్తున్న కృషి దేశవ్యాప్తంగా పేరు తీసుకొచ్చింది. సుప్రీం కోర్టు కూడా నూతన పారిశుద్ధ్య విధానం బాగుందని, సూర్యాపేట దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని ప్రసంశించింది. దేశంలోని అన్ని మున్సిపాలిటీలు ఇదే విధానాన్ని అమలు చేసి పరిశుభ్రతను పాటించేలా చూడాలని సూచించింది. దాంతో ఉమ్మడి రాష్ట్రంతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన మున్సిపాలిటీల బృందాలు సూర్యాపేటకు వచ్చి ఇక్కడ అమలు చేస్తున్న విధానాన్ని అధ్యయనం చేశాయి. ఒక సంవత్సర కాలంలోనూ సుమారు 200 బృందాలు సూర్యాపేటలో పర్యటించాయి.

ఫ ఆనాటి చైర్మన్‌ జుట్టుకొండ వినూత్న ఆలోచన

ఫ 2004లో మున్సిపాలిటీకి జాతీయ పురస్కారం

ఫ సూర్యాపేటను సందర్శించిన వివిధ రాష్ట్రాల ప్రతినిధులు

దేశంలో మొదటగా ‘పేట’లోనే..1
1/3

దేశంలో మొదటగా ‘పేట’లోనే..

దేశంలో మొదటగా ‘పేట’లోనే..2
2/3

దేశంలో మొదటగా ‘పేట’లోనే..

దేశంలో మొదటగా ‘పేట’లోనే..3
3/3

దేశంలో మొదటగా ‘పేట’లోనే..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement