మత్తు పదార్థాలకు బానిస కావొద్దు | - | Sakshi
Sakshi News home page

మత్తు పదార్థాలకు బానిస కావొద్దు

Feb 11 2026 8:57 AM | Updated on Feb 11 2026 8:57 AM

మత్తు పదార్థాలకు బానిస కావొద్దు

మత్తు పదార్థాలకు బానిస కావొద్దు

యాదగిరిగుట్ట: మత్తు పదార్థాలకు బానిస కావొద్దని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మాధవిలత అన్నారు. మాదక ద్రవ్య నిషేధ చట్టాలు, చెడు ప్రభావం అంశాలపై యాదగిరిగుట్ట పట్టణంలోని పాలిటెక్నిక్‌ కళాశాలలో మంగళవారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, జిల్లా ప్రొహిబిషన్‌ అండ్‌ ఎకై ్సజ్‌, యాదాద్రి బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో న్యాయవిజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మత్తుపదార్థాల నిషేధ చట్టం పగడ్బందీగా అమలు అవుతుందన్నారు. జిల్లా ప్రొహిబిషన్‌ అండ్‌ ఎకై ్సజ్‌ సూపరింటెండెంట్‌ విష్ణుమూర్తి మాట్లాడుతూ.. మత్తు పదార్థాల వాడకం చాప కింద నీరులా ఎక్కువ అవుతుందని, వాటి బారిన పడడానికి వ్యాపారులు అనేక రకాలుగా మభ్యపెడుతున్నారన్నారు. ఎవరైనా నేరం చేస్తే తీవ్రమైన శిక్షలే కాకుండా, ఫైన్‌ కూడా అధిక మొత్తంలో ఉంటుందని తెలిపారు. న్యాయవిజ్ఞాన సదస్సులో యాదాద్రి బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు శ్రీహరి, పెంట రమేష్‌, మీడియేషన్‌ న్యాయవాది రాజిరెడ్డి, డిప్యూటీ లీగల్‌ ఎయిడ్‌ డిఫెన్స్‌ కౌన్సిల్‌ బొమ్మ వెంకటేష్‌, న్యాయ సహాయ న్యాయవాది సాయి శ్రీనివాస్‌, ప్రొహిబిషన్‌ అండ్‌ ఎకై ్సజ్‌ సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్లు రాధాకృష్ణ, దీపిక, వేణుకుమార్‌, కళాశాల ఎన్‌ఎస్‌ఎస్‌ ఇన్‌చార్జ్‌ ఉపేందర్‌, లెక్చరర్లు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

ఫ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మాధవిలత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement