గెలుపు గుర్రాలకే బీఆర్‌ఎస్ టికెట్లు
సూర్యాపేటటౌన్ : సూర్యాపేట మున్సిపాలిటీలో గెలుపు గుర్రాలకే కౌన్సిలర్ టికెట్లు ఇచ్చామని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్‌రెడ్డి అన్నారు. మంగళవారం సూర్యాపేట పట్టణంలోని బీఆర్‌ఎస్ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్‌కు తగిన బుద్ధి చెప్పేందుకు పట్టణ ప్రజలు ఎదురుచూస్తున్నారని, మహానగరాలకు దీటుగా సూర్యాపేటను తీర్చిదిద్దామన్నారు. పరిశుభ్రంగా ఉన్న సూర్యాపేట పట్టణాన్ని కాంగ్రెస్ పాలకులు రెండేళ్లలో ఆగం చేశారని, 2014కు ముందు.. తర్వాత అన్న రీతిలో సూర్యాపేటలో అభివృద్ధి జరిగిందన్నారు. ఇచ్చిన మాట ప్రకారమే సూర్యాపేటను జిల్లాగా మార్చుకున్నామని, మెడికల్ కాలేజ్, కలెక్టరేట్, ఎస్పీ ఆఫీస్, మహాప్రస్థానం ఇలా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశామని, రోడ్లు, సెంట్రల్ లైటింగ్, ట్యాంక్ బండ్, బోటింగ్, పార్కులతో ఆహ్లాదాన్ని పెంచామని పేర్కొన్నారు. బీఆర్‌ఎస్ అభ్యర్థులను గెలిస్తేనే మరింత అభివృద్ధి సాధ్యమన్నారు. రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి శూన్యమని, వచ్చిన నిధులను వాపస్ పంపిన దుర్మార్గం కాంగ్రెస్ పార్టీ దేనన్నారు. భారీ మెజార్టీతో మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఫ మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి


