ప్రజా సమస్యలపై పోరాడే వారిని గెలిపించాలి | - | Sakshi
Sakshi News home page

ప్రజా సమస్యలపై పోరాడే వారిని గెలిపించాలి

Feb 8 2026 7:14 AM | Updated on Feb 8 2026 7:14 AM

ప్రజా

ప్రజా సమస్యలపై పోరాడే వారిని గెలిపించాలి

భువనగిరిటౌన్‌, చౌటుప్పల్‌, భూదాన్‌పోచంపల్లి, ఆలేరు: నిత్యం ప్రజా సమస్యలపై పోరాడే వ్యక్తులను మున్సిపల్‌ ఎన్నికల్లో గెలిపించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ, భువనగిరి, మునుగోడు మాజీ ఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్‌రెడ్డి, కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. శనివారం భువనగిరి పట్టణంలో 6వ వార్డు సీపీఎం అభ్యర్థి కొలుపుల వివేకానంద విజయాన్ని కాక్షిస్తూ ఎన్నికల ప్రచారం చేశారు. అలాగే చౌటుప్పల్‌లోని పలు వార్డుల్లో బీఆర్‌ఎస్‌, సీపీఎం మిత్రపక్షాల అభ్యర్థులను గెలిపించాలని జాన్‌వెస్లీ.. మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్‌రెడ్డితో కలిసి ప్రచారం నిర్వహించారు. భూదాన్‌పోచంపల్లిలోని 4వ వార్డులో సీపీఎం అభ్యర్థి వడ్డేపల్లి యాదగిరి తరఫున జాన్‌వెస్లీ ప్రచారం నిర్వహించారు. అదేవిధంగా ఆలేరు మున్సిపాలిటీలో 4వ వార్డు సీపీఎం అభ్యర్థి భాగ్యలక్ష్మిని గెలిపించాలని ప్రచారం, కార్నర్‌ మీటిగ్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా చోట్లలో జాన్‌వెస్లీ మాట్లాడుతూ చౌటుప్పల్‌లో బీఆర్‌ఎస్‌, సీపీఎం మిత్రపక్ష అభ్యర్థులను గెలిపించాలన్నారు. పోచంపల్లి, ఆలేరులో సీపీఎం అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. డబ్బు, మద్యం తదితర ప్రలోభాలతో రాజకీయాలు చేసే నాయకులు ప్రజాసేవ చేయలేరని, అలాంటి వారికి ఓటెయ్యొద్దని, ప్రజల పక్షాన పోరాడే వారిని కౌన్సిలర్లుగా ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు. భువనగిరి, చౌటుప్పల్‌, భూదాన్‌పోచంపల్లి, ఆలేరులో నిర్వహించిన ఎన్నికల ప్రచారాల్లో సీపీఎం, బీఆర్‌ఎస్‌ నాయకులు ఎండి జహంగీర్‌, బట్టుపల్లి అనురాధ, మాయ కృష్ణ, దాసరి పాండు, గడ్డం వెంకటేష్‌, లౌడియారాజ్‌, ఏవీ.కిరణ్‌, కొలుపుల అమరేందర్‌, ఎనబోయిన ఆంజనేయులు, తుమ్మల పాండు, ముల్కలపల్లి సత్యనారాయణ, గంటెపాక భిక్షపతి, నీలశ్రీనివాస్‌, గద్దె నరసింహ, బీఆర్‌ఎస్‌ ఎన్నికల ఇన్‌చార్జి చింతల వెంకటేశ్వర్‌రెడ్డి, మాజీ జెడ్పీటీసీ పెద్దిటి బుచ్చిరెడ్డి, నాయకులు బొమ్మిరెడ్డి వెంకట్‌రెడ్డి, బూరుగు కృష్ణారెడ్డి, గంగదేవి సైదులు, కొండమడుగు నర్సింహ, గుడూరు అంజిరెడ్డి, మండల కార్యదర్శి కోట రాంచంద్రారెడ్డి, కల్లూరి మల్లేశం, ఇక్బాల్‌, మొరిగాడి రమేష్‌, మాజీ కౌన్సిలర్లు, సర్పంచ్‌లు తదితరులు పాల్గొన్నారు.

సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ

భువనగిరి, చౌటుప్పల్‌, భూదాన్‌పోచంపల్లి,

ఆలేరు మున్సిపాలిటీల్లో ఎన్నికల ప్రచారం

ప్రజా సమస్యలపై పోరాడే వారిని గెలిపించాలి1
1/1

ప్రజా సమస్యలపై పోరాడే వారిని గెలిపించాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement