మూడు వార్డులకు.. ఒక రిటర్నింగ్ అధికారి
మిర్యాలగూడ టౌన్ : మున్సిపల్ ఎన్నికల్లో కొన్ని బాధ్యతలను రిటర్నింగ్ అధికారులకు అప్పగిస్తుండడంతో మున్సిపల్ కమిషనర్లకు కొంతమేర భారం తగ్గనుంది. వారు వివిధ కార్యకలాపాలపై ప్రత్యేకంగా కేంద్రీకరించే అవకాశం ఉంది. ఎన్నికల్లో భాగంగా ప్రతి మూడు వార్డులకు ఒకరి చొప్పున రిటర్నింగ్ అధికారిని నియమిస్తారు. ప్రతి రిటర్నింగ్ అధికారికి ప్రత్యేకంగా కౌంటర్ కేటాయిస్తారు. మున్సిపాలిటీలో అదనంగా 20శాతం మందిని ఆర్‌ఓ, అసిస్టెంట్ ఆర్‌ఓలుగా నియమిస్తారు. పార్టీ అభ్యర్థులకు, స్వతంత్రులకు గుర్తులను కేటాయించే బాధ్యత కూడా వీరికే ఉంటుంది. ఎన్నికల ఫలితాల రోజున ఆర్‌ఓలు కీలకంగా ఉంటారు. అదేవిధంగా కౌన్సిలర్‌గా గెలుపొందిన వారికి ధ్రువపత్రాలు అందజేస్తారు.


