అధికారంలో ఉన్న కాంగ్రెస్‌కు ఓటు వేయండి
యాదగిరిగుట్ట: అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని సినీ హీరో సుమన్ కోరారు. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా సోమవారం యాదగిరిగుట్ట మున్సిపాలిటీ పరిధిలోని ఏడో వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి పెలిమెల్లి లావణ్య శ్రీధర్ గౌడ్ కు మద్దతుగా ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్యతో కలిసి ఆయన ప్రచారం చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్ లో సుమన్ మాట్లాడారు. గత పదిహేళ్లుగా ప్రభుత్వంలో ఉన్న బీఆర్‌ఎస్ ఎలాంటి అభివృద్ధి చేయలేదని విమర్శించారు. మరో మూడేళ్ల పాటు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుందని.. యాదగిరిగుట్ట పట్టణం, వార్డులు అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పెలిమెల్లి లావణ్య భర్త పెలిమెల్లి శ్రీధర్ గౌడ్ తనకు వీర అభిమాని అని, 30 ఏళ్లుగా శ్రీధర్ యాదగిరిగుట్ట పట్టణంలో ఎన్నో సామాజిక, స్వచ్ఛంద కార్యక్రమాలు నిర్వహించారని చెప్పారు. పెలిమెల్లి లావణ్యకు ప్రజలు మద్దతుగా నిలిచి , ఓటు వేసి గెలిపించాలన్నారు. ఈ ప్రచారంలో ప్రొడ్యూసర్ జైహింద్ గౌడ్, కాంగ్రెస్ నాయకులు భిక్షపతి గౌడ్, గుడ్ల వరలక్ష్మి, గుండు జ్యోతి పాల్గొన్నారు.
ఫ సినీ నటుడు సుమన్


