ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు పెరగాలి
రామన్నపేట: ప్రభుత్వ ఆస్పత్రుల్లో సురక్షితమైన సాధారణ ప్రసవాల సంఖ్య పెరగాలని జిల్లా ఆస్పత్రుల సేవల సమన్వయకర్త (డీసీహెచ్‌ఎస్) డాక్టర్ చిన్నానాయక్ సూచించారు. బుధవారం రామన్నపేట ప్రభుత్వ ఆస్పత్రిలోని వార్డులను సందర్శించారు. ఓపీ విభాగంలో ప్రజలకు అందుతున్న వైద్యసేవలను పరిశీలించారు. వైద్యులు, సిబ్బందితో వేర్వేరుగా సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు. ఆస్పత్రికి వచ్చే ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా వైద్యసేవలు అందించాలని ఆదేశించారు. ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తే ఉపేక్షించబోమని హెచ్చరించారు. ఆయన వెంట డాక్టర్లు బి.వీరన్న, రజని, స్వాతీబాయి, మాధవాచారి, నవీన్‌సింగ్, వీణ, సుమంగలి, హెడ్‌నర్సులు సువర్ణ, సోలీ, జ్యోతి తదితరులు పాల్గొన్నారు.
ఎస్సీ కార్పొరేషన్‌కు నిధులు మంజూరు చేయాలి
యాదగిరిగుట్ట : ఎస్సీ కార్పొరేషన్‌కు రూ.12కోట్ల నిధులు మంజూరు చేసి, దళితులకు న్యాయం చేయాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మేడి పాపన్న డిమాండ్ చేశారు. యాదగిరిగుట్ట పట్టణంలో బుధవారం నిర్వహించిన ఎమ్మార్పీఎస్ జిల్లా సదస్సులో ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వం ఎస్సీ కార్పొరేషన్ నిధులు ఔటర్ రింగ్ రోడ్డుకు, కాళేశ్వరం ప్రాజెక్టుకు మళ్లించి, దుర్వినియోగం చేసిందని ఆరోపించారు. మాదిగలకు సంబంధించిన అసైన్డ్ భూములను అమ్ముకునే విధంగా చట్టం చేసి, భూ భారతీ ద్వారా పట్టా పాస్ బుక్కులు మంజూరు చేయాలని కోరారు. యాదగిరిగుట్ట పరిసర ప్రాంతంలో ఐదు ఎకరాల భూమిని కేటాయించి, రూ.5 కోట్లతో వసతి గృహాలు కట్టించి ఇవ్వాలని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్యను కోరారు. యాదగిరి ఆలయంలో మాదిగలకు ఉద్యోగాలు కల్పించాలన్నారు. సదస్సులో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేదాసి మోహన్, మంచాల యాదగిరి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు మీసాల ఉప్పలయ్య, యువసేన రాష్ట్ర అధ్యక్షుడు కూరేళ్ల రమేశ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగరాజు, బూసి మహేశ్ మాదిగ తదితరులు పాల్గొన్నారు.
పాల బిల్లులు చెల్లించాలి
భువనగిరిటౌన్ : పెండింగ్‌లో ఉన్న పాల బిల్లలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ పాల శీతలీకరణ కేంద్రం వద్ద పాల సంఘం చైర్మన్లు బుధవారం నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. పాల బిల్లులు సక్రమంగా పంపిణీ చేయకపోవడంతో పాడి రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో వెంకట్‌రెడ్డి, భిక్షపతి, కోటేష్, నర్సింహులు, విజయ్, గౌరయ్య ఉన్నారు.
యాదగిరి క్షేత్రంలో సంప్రదాయ పూజలు
యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో సంప్రదాయ పూజలు కొనసాగాయి. బుధవారం వేకువజామునే ఆలయాన్ని తెరచిన అర్చకులు శ్రీస్వామి అమ్మవార్లకు సుప్రభాతం జరిపించారు. అనంతరం స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులకు నిజాభిషేకం, తులసీ దళాలతో అర్చన వంటి పూజలు చేపట్టారు. ఇక ఆలయ ప్రథమ ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, గజ వాహన సేవ, నిత్య కల్యాణం, బ్రహ్మోత్సవం వంటి కై ంకర్యాలను భక్తులచే నిర్వహించారు. ముఖ మండపంలో సువర్ణ పుష్పార్చన మూర్తులకు అష్టోత్తర పూజలు జరిపించారు. వివిధ పూజల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు.
ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు పెరగాలి
ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు పెరగాలి


