నవాబు నుంచి మాన్యం చెల్క | - | Sakshi
Sakshi News home page

నవాబు నుంచి మాన్యం చెల్క

Feb 8 2026 7:15 AM | Updated on Feb 8 2026 7:15 AM

నవాబు

నవాబు నుంచి మాన్యం చెల్క

రామగిరి(నల్లగొండ) : నల్లగొండ పట్టణంలోని దేవరకొండ రోడ్డులో ఉన్న మాన్యం చెల్క ప్రాంతం మాన్యం బావిగా రికార్డులలో ఉంది. ఒకప్పుడు ఈ ప్రాంతంలో నీటి కరువు ఏర్పడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుండడంతో అప్పటి భూ స్వామి ఇక్కడ బావి తవ్వించాడు. దాంతో పాటు పేదలకు కొంత భూమిని కూడా దానం చేశాడు. భూస్వామి ఇచ్చిన భూమిలో ప్రజలు నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. అప్పటి నుంచి ఈ ప్రాంతాన్ని మాన్యం బావిగా పిలవడం మొదలు పెట్టారు. దాంతో పాటు నిజాం పాలకుల్లో ఐదవ రాజైన అఫ్జల్‌ ఉద్దౌలా తీవ్ర అస్వస్థకు గురయ్యాడు. చాలా మంది వైద్యులు వైద్యం అందించినా తగ్గలేదు. దాంతో నల్లగొండ పట్టణంలోని ప్రముఖ వైద్యుడు కన్నయ్య వద్దకు వచ్చాడు. ఆయన అందించిన వైద్యంతో జబ్బు నయమైంది. దీనికి కృతజ్ఞతగా ప్రస్తుత మాన్యం చెల్క ప్రాంతాన్ని వైద్యుడికి ఇనాంగా ఇచ్చాడు. అప్పటి నుంచి ఈ ప్రాంతానికి మాన్యం చెల్క అని పేరు వచ్చింది.

నవాబు నుంచి మాన్యం చెల్క1
1/2

నవాబు నుంచి మాన్యం చెల్క

నవాబు నుంచి మాన్యం చెల్క2
2/2

నవాబు నుంచి మాన్యం చెల్క

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement