మిర్యాలగూడెం
నాడు
నేడు
మిర్యాలగూడ టౌన్ : ఒకప్పటి చిన్నగూడమే నేడు మిర్యాలగూడగా మారింది. 1949 వరకు చిన్నగూడెంగా పిలిచేవారు. 1952లో మిర్యాలగూడగా పేరుమారింది. 1956లో పంచాయతీగా 1983లో పంచాయతీ నుంచి మేజర్ పంచాయతీగా, 1984లో గ్రేడ్– 3 మున్సిపాలిటీగా, 1989లో గ్రేడ్–3 నుంచి గ్రేడ్–2 మున్సిపాలిటీగా మారింది. 2005లో గ్రేడ్–2 నుంచి గ్రేడ్–1 మున్సిపాలిటీగా ఏర్పడింది. మొదటగా 34 వార్డులుండగా పట్టణ సమీపంలోని గ్రామాలను విలీనం చేస్తూ జీఓ 114ను అప్పటి ప్రభుత్వం విడుదల చేసింది. శివారు ప్రాంతాల అభివృద్ధితో 36 వార్డులకు చేరుకోవడంతో పట్టణ విస్తీర్ణం 21 చదరపు కిలోమీటర్లకు పెరిగింది. ఆ తరువాత మిర్యాలగూడ మున్సిపాలిటీలోకి నందిపాడు గ్రామ పంచాయతీ అయిన నందిపాడు క్యాంపు, రవీందర్‌నగర్ కాలనీ, ఎఫ్‌సీఐ కాలనీ, వెంకటాద్రిపాలెం గ్రామ పంచాయితీ పరిధిలోని 9వ వార్డు గణేష్‌నగర్, గుడూరు గ్రామ పంచాయతీ పరిధిలోని హైదలాపురం(ప్రస్తుతం ఇందిరమ్మ కాలనీ) మున్సిపాలిటీలో విలీనమయ్యాయి. దీంతో 36 వార్డుల నుంచి 48 వార్డులకు చేరకున్నాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం ఈ మున్సిపాలిటీలో మొత్తం లక్షా 9వేల 891 మంది జనాభా ఉంది. ప్రస్తుతం పట్టణ విస్తీర్ణం 32.2 చదరపు కిలోమీటర్లకు చేరుకుంది.


