ఎన్జీ కళాశాల అధ్యాపకుడికి అరుదైన గౌరవం
రామగిరి(నల్లగొండ), నకిరేకల్: అంతర్జాతీయ మాతృ భాషా దినోత్సవం సందర్భంగా సోమవారం రాత్రి హైదరాబాద్‌లోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖ, తెలుగు పద సంపద సంయుక్తంగా అంతర్జాతీయ తెలుగు భాష సభ నిర్వహించారు. ఈ సభలో నకిరేకల్ మండలం చందుపట్ల గ్రామ వాసి, నల్లగొండ పట్టణంలోని ఎన్జీ కళాశాల తెలుగు అధ్యాపకుడు టంగుటూరి సైదులు పాల్గొని తెలుగు పద్య వైభవం–జీవన పరమార్ధం అనే అంశంపై పత్ర సమర్పణ చేశారు. సమాజంలో అంతరించిపోతున్న మానవ విలువలు, నేటి తరానికి తెలుగు సాహిత్య అవకశ్యకత గురించి సైదులు సభలో ప్రసంగించారు. అనంతరం ఉస్మానియా యూనివర్సిటీ తెలుగు శాఖ అధ్యక్షుడు ఆచార్య సాగి కమలాకరశర్మ, తెలుగు పద సంపద అధ్యక్షుడు మూర్తి రేమిళ్ల, తెలుగు విశ్వ విద్యాలయం మాజీ రిజిస్ట్రార్ ఆచార్య టి. గౌరీశంకర్ ఆయనకు మెమొంటో, ధ్రువపత్రం అందజేశారు. టంగుటూరి సైదులును ఎన్జీ కళాశాల తెలుగు ఇన్‌చార్జి వెల్దండి శ్రీధర్, అధ్యాపకులు అభినందించారు.
ఫ అంతర్జాతీయ తెలుగు భాష
సభలో పాల్గొని పత్ర సమర్పణ చేసిన టంగుటూరి సైదులు


